Telugu Global
Cinema & Entertainment

సందీప్ రెడ్డి సినిమాని మరోసారి రిజెక్ట్ చేసిన శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం “పడి పడి లేచే మనసు” రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఈ హీరో బ్లాక్ బస్టర్ సినిమా అయిన “అర్జున్ రెడ్డి” ని రిజెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా మొదట ఈ కథ రాసుకున్నప్పుడు శర్వానంద్ ని మైండ్ లో అనుకోని రాసుకున్నాడట. కథ మొత్తం పూర్తయ్యాక శర్వానంద్ దగ్గరకి వెళ్లి కథ కూడా చెప్పాడు. కానీ శర్వానంద్ ఆ టైం లో […]

సందీప్ రెడ్డి సినిమాని మరోసారి రిజెక్ట్ చేసిన శర్వానంద్
X

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం “పడి పడి లేచే మనసు” రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఈ హీరో బ్లాక్ బస్టర్ సినిమా అయిన “అర్జున్ రెడ్డి” ని రిజెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా మొదట ఈ కథ రాసుకున్నప్పుడు శర్వానంద్ ని మైండ్ లో అనుకోని రాసుకున్నాడట. కథ మొత్తం పూర్తయ్యాక శర్వానంద్ దగ్గరకి వెళ్లి కథ కూడా చెప్పాడు. కానీ శర్వానంద్ ఆ టైం లో ఆ కథ తనకి సెట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేసాడు. కట్ చేస్తే ఆ విజయ్ దేవరకొండ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఇదిలా ఉంటే “అర్జున్ రెడ్డి” హిట్ తరువాత శర్వానంద్ కి మరో కథ చెప్పాడట సందీప్ రెడ్డి వంగా. కానీ శర్వా కి ఆ కథ కూడా కంఫర్ట్ గా అనిపించలేదట. అందుకే ఈ సారి కూడా సందీప్ రెడ్డి వంగా కథని రిజెక్ట్ చేసాడు శర్వానంద్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా “అర్జున్ రెడ్డి” సినిమాని హిందీ లో షహీద్ కపూర్ హీరోగా తెరకేక్కిస్తున్నాడు.

First Published:  20 Dec 2018 2:29 AM GMT
Next Story