Telugu Global
National

సినీ హీరో విశాల్‌ను అరెస్ట్‌ చేసిన చెన్నై పోలీసులు

తమిళ చిత్ర పరిశ్రమలో వర్గపోరు ముదిరింది. తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న హీరో విశాల్‌ అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసులు ఆయన్ను గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈనెల 21న తమిళనాడులో ఒకే రోజు 9 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇలా ఓకే రోజు ఇన్ని సినిమాల విడుదలకు నిర్మాతల మండలి ఎలా అనుమతి ఇచ్చిందని చిన్న నిర్మాతలు ఆందోళనకు దిగారు. విశాల్‌పై వారు తీవ్ర […]

సినీ హీరో విశాల్‌ను అరెస్ట్‌ చేసిన చెన్నై పోలీసులు
X

తమిళ చిత్ర పరిశ్రమలో వర్గపోరు ముదిరింది. తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న హీరో విశాల్‌ అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసులు ఆయన్ను గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.

ఈనెల 21న తమిళనాడులో ఒకే రోజు 9 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇలా ఓకే రోజు ఇన్ని సినిమాల విడుదలకు నిర్మాతల మండలి ఎలా అనుమతి ఇచ్చిందని చిన్న నిర్మాతలు ఆందోళనకు దిగారు. విశాల్‌పై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే రోజు అన్ని సినిమాలు విడుదలకు అనుమతి ఇవ్వడం ద్వారా చిన్న సినిమాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతల సంఘం ఆఫీస్‌కు మరో వర్గం వారు తాళం వేశారు. ఆ తాళం పగులగొట్టేందుకు విశాల్‌ ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న నిర్మాతల ఫిర్యాదు మేరకు పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేశారు.

తనను అరెస్ట్ చేయడంపై పోలీసులను విశాల్ నిలదీశారు. తాను నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నానని… అలాంటప్పుడు తన అనుమతి లేకుండా కార్యాలయానికి అధికారం లేని వ్యక్తులు ఎలా తాళం వేస్తారని ప్రశ్నించారు. పోలీసులు అలాంటి వ్యక్తులకే మద్దతు ఎలా పలుకుతారని విశాల్ ప్రశ్నించారు.

ఇలా అధికారం లేని వ్యక్తులు ఆఫీస్‌ను స్వాధీనం చేసుకుంటే… ఒకవేళ ఆఫీసులో విలువైన వస్తువులు, ఫైళ్లు మాయమైతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల మీద గౌరవం ఉంది కాబట్టి అరెస్ట్‌కు సహకరిస్తున్నట్టు చెప్పారు.

First Published:  20 Dec 2018 1:59 AM GMT
Next Story