Telugu Global
Cinema & Entertainment

లావణ్య త్రిపాఠి.... రామ్ చరణ్ కు సారీ చెప్పింది అందుకే....

హీరో రామ్ చరణ్ కు హీరోయిన్ లావణ్య త్రిపాఠి సారీ చెప్పింది. నిజానికి వీళ్లిద్దరికీ సంబంధం లేదు. కలిసి సినిమా కూడా చేయలేదు. కానీ ఓ ప్రత్యేక సందర్భంలో చరణ్ కు లావణ్య క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం అంతరిక్షం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు రామ్ చరణ్. సినిమా యూనిట్ మొత్తాన్ని మెచ్చుకున్నాడు. వేదికపై మాట్లాడిన ప్రముఖులంతా చరణ్ కు […]

లావణ్య త్రిపాఠి.... రామ్ చరణ్ కు సారీ చెప్పింది అందుకే....
X

హీరో రామ్ చరణ్ కు హీరోయిన్ లావణ్య త్రిపాఠి సారీ చెప్పింది. నిజానికి వీళ్లిద్దరికీ సంబంధం లేదు. కలిసి సినిమా కూడా చేయలేదు. కానీ ఓ ప్రత్యేక సందర్భంలో చరణ్ కు లావణ్య క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం అంతరిక్షం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు రామ్ చరణ్. సినిమా యూనిట్ మొత్తాన్ని మెచ్చుకున్నాడు. వేదికపై మాట్లాడిన ప్రముఖులంతా చరణ్ కు కృతజ్ఞతలు చెప్పారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం చెప్పలేదు. దీనిపై ఆమె సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది.

స్టేజ్ పై కాస్త టెన్షన్ గా ఉండడం వల్లనే రామ్ చరణ్ ను తను మరిచిపోయానని అంటోంది లావణ్య త్రిపాఠి. అంతరిక్షం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చెర్రీ రావడం తమకు ఎంతో ఆనందాన్ని, సినిమాపై నమ్మకాన్ని పెంచిందని తెలిపిన లావణ్య.. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినందుకు రామ్ చరణ్ కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పింది.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అదితి రావు. లావణ్య త్రిపాఠి రోల్ కేవలం ఓ అర్థగంట మాత్రమే ఉంటుంది. కానీ సినిమాలో అది చాలా కీలకం అంటున్నారు. రేపు థియేటర్లలోకి రాబోతోంది అంతరిక్షం.

First Published:  20 Dec 2018 8:07 AM GMT
Next Story