Telugu Global
International

ఆ కప్పకు ట్రంప్ పేరు....అచ్చం ట్రంప్ లాగే ప్రవర్తిస్తుందట!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును కొత్త జాతికి చెందిన ఓ కప్పకు పెట్టారు. ఇటీవల పనామాలో కొంతమంది శాస్త్రవేత్తలకు ఓ వింత ఆకారంలో ఉన్న కప్ప లభ్యమైంది. ఆ కప్పకు కళ్లు, కాళ్లు లేవట. పరిశోధన అనంతరం ఈ కప్పను వేలం వేశారు. యూకేకు చెందిన ఎయిడెన్ బెల్ అనే ఎన్విరో బిల్డ్ కంపెనీ యజమాని…. 34వేల డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే ఆ కప్పకు డెర్మొఫిస్ డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టినట్టు బెల్ తెలిపారు. […]

ఆ కప్పకు ట్రంప్ పేరు....అచ్చం ట్రంప్ లాగే ప్రవర్తిస్తుందట!
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును కొత్త జాతికి చెందిన ఓ కప్పకు పెట్టారు. ఇటీవల పనామాలో కొంతమంది శాస్త్రవేత్తలకు ఓ వింత ఆకారంలో ఉన్న కప్ప లభ్యమైంది. ఆ కప్పకు కళ్లు, కాళ్లు లేవట. పరిశోధన అనంతరం ఈ కప్పను వేలం వేశారు.

యూకేకు చెందిన ఎయిడెన్ బెల్ అనే ఎన్విరో బిల్డ్ కంపెనీ యజమాని…. 34వేల డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే ఆ కప్పకు డెర్మొఫిస్ డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టినట్టు బెల్ తెలిపారు.

ట్రంప్ పేరుపెట్టడానికి కూడా ఓ కారణం ఉందన్నారు. ట్రంప్ వాతావరణ సమస్యల గురించి పట్టించుకోరని… అందుకే ఆ కప్పకు ట్రంప్ పేరు పెడితే సరిగ్గా సరిపోతుందని భావించినట్లు చెప్పుకొచ్చారు.

కప్ప దాదాపు 10 సెంటీమీటర్ల పొడవుందట. పాములా ఈ కప్ప ఆకారం ఉంటుంది. సిసీలియన్ జాతికి చెందిన ఈ కప్ప అచ్చం ట్రంప్ లాగే ప్రవర్తిస్తుందని…ఎన్విరోబర్డ్ కంపెనీ తెలిపింది.

First Published:  19 Dec 2018 9:30 PM GMT
Next Story