భారత మహిళా క్రికెట్ నయా కోచ్ గా డబ్లువీ రామన్

  • 27 మందితో పోటీపడి కోచ్ గా ఎంపికైన రామన్
  • రామన్ కు 11 టెస్టులు, 27 వన్డేలు ఆడిన రికార్డు
  • సౌతాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన భారత తొలి క్రికెటర్ రామన్

భారత మహిళా క్రికెట్ సరికొత్త చీఫ్ కోచ్ గా మాజీ ఓపెనర్ డబ్లువీ రామన్ ఎంపికయ్యారు. గత రెండు రోజులుగా బీసీసీఐ అడహాక్ కమిటీ నిర్వహించిన కోచ్ ఇంటర్వ్యూలకు మొత్తం 28 మంది దరఖాస్తు చేసుకోగా….టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ను అధిగమించి…డబ్లువి రామన్ కోచ్ గా  ఎంపికయ్యారు.

ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచకప్ వరకూ భారత మహిళా క్రికెట్ చీఫ్ కోచ్ గా ఉన్న రమేశ్ పోవార్ పదవీకాలం…నవంబర్ 30తో ముగియడంతోనే బీసీసీఐ తాజాగా ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చేపట్టింది.

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి మరీ ఇంటర్వ్యూలు నిర్వహించింది.

భారత మహిళా క్రికెట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొన్న ప్రముఖుల్లో…గ్యారీ కిర్ స్టెన్, డబ్లువి రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్ టన్, దిమిత్రీ మస్కెరెనాస్, బ్రాడ్ హాగ్,  కల్పనా వెంకటాచారి ఉన్నారు.

 వీరిలో…ముగ్గురికి నేరుగానూ, ఐదుగురికి స్కైప్ ద్వారాను, ఒకరికి ఫోను ద్వారాను ఇంటర్వ్యూలు నిర్వహించారు.చివరకు గ్యారీ కిర్ స్టెన్, రామన్ ల పేర్లను…షార్ట్ లిస్ట్ చేసినా….వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని…రామన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.

 రామన్ కు టీమిండియా తరపున 11 టెస్టులు, 27 వన్డేలు ఆడిన రికార్డు ఉంది. అంతేకాదు…1992-93 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన భారత తొలిక్రికెటర్ గా కూడా రామన్ కు అరుదైన ఘనత ఉంది.