Telugu Global
NEWS

హాట్ హాట్ గా భారత మహిళా క్రికెట్ కోచ్ రేస్

కోచ్ పదవి కోసం 28 దరఖాస్తులు రేస్ ఫైనల్లో గ్యారీ కిర్ స్టెన్, డబ్లువీ రామన్ నవంబర్ 30తో ముగిసిన రమేశ్ పొవార్ పదవీ కాలం భారత మహిళా క్రికెట్ చీఫ్ కోచ్ ఇంటర్వ్యూల రేస్ హాట్ హాట్ గా మారింది. భారత మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, డబ్లువి రామన్, టీమిండియా మాజీ చీఫ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ లతో సహా…. మొత్తం 28 కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఇటీవలే […]

హాట్ హాట్ గా భారత మహిళా క్రికెట్ కోచ్ రేస్
X
  • కోచ్ పదవి కోసం 28 దరఖాస్తులు
  • రేస్ ఫైనల్లో గ్యారీ కిర్ స్టెన్, డబ్లువీ రామన్
  • నవంబర్ 30తో ముగిసిన రమేశ్ పొవార్ పదవీ కాలం

భారత మహిళా క్రికెట్ చీఫ్ కోచ్ ఇంటర్వ్యూల రేస్ హాట్ హాట్ గా మారింది. భారత మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, డబ్లువి రామన్, టీమిండియా మాజీ చీఫ్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ లతో సహా…. మొత్తం 28 కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొన్నారు.

ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచకప్ వరకూ భారత మహిళా క్రికెట్ చీఫ్ కోచ్ గా ఉన్న రమేశ్ పోవార్ పదవీకాలం…నవంబర్ 30తో ముగియడంతోనే బీసీసీఐ తాజాగా ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చేపట్టింది.

ముగ్గురు సభ్యులతో ఎంపిక సంఘం….

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి మరీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

భారత మహిళా క్రికెట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొన్న ప్రముఖుల్లో…గ్యారీ కిర్ స్టెన్, డబ్లువి రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్ టన్, దిమిత్రీ మస్కెరెనాస్, బ్రాడ్ హాగ్, కల్పనా వెంకటాచారి ఉన్నారు.

వీరిలో…ముగ్గురికి నేరుగానూ, ఐదుగురికి స్కైప్ ద్వారాను, ఒకరికి ఫోను ద్వారాను ఇంటర్వ్యూలు నిర్వహించారు.

రేస్ ఫైనల్లో రామన్, కిర్ స్టెన్….

చివరకు గ్యారీ కిర్ స్టెన్, రామన్ ల పేర్లను…షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంథానా మాత్రం…తమకు గత కోచ్ రమేశ్ పోవారే కావాలని గట్టిగా చెబుతున్నారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఎంపిక వివాదంతో… రమేశ్ పొవార్ తన పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.

First Published:  20 Dec 2018 2:00 AM GMT
Next Story