Telugu Global
Cinema & Entertainment

ఈసారి.... కంగనా రనౌత్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా?

“మణికర్ణిక”….ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తను కూడా కొంత భాగం డైరెక్ట్ చేశానని…. డైరెక్టర్ గా తన పేరు కూడా టైటిల్స్ లో వచ్చేలా చేసుకుంది కంగనా రనౌత్. అయితే కంగనా రనౌత్ ఇలా ఒక సినిమాని వివాదం లోకి లాగడం ఇదేమి తొలిసారి కాదట. గతంలో కూడా కంగనా రనౌత్ ఇలాగే సినిమాలకి మంచి పబ్లిసిటీ తెచ్చుకుంది అని టాక్. […]

ఈసారి.... కంగనా రనౌత్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా?
X

“మణికర్ణిక”….ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తను కూడా కొంత భాగం డైరెక్ట్ చేశానని…. డైరెక్టర్ గా తన పేరు కూడా టైటిల్స్ లో వచ్చేలా చేసుకుంది కంగనా రనౌత్.

అయితే కంగనా రనౌత్ ఇలా ఒక సినిమాని వివాదం లోకి లాగడం ఇదేమి తొలిసారి కాదట. గతంలో కూడా కంగనా రనౌత్ ఇలాగే సినిమాలకి మంచి పబ్లిసిటీ తెచ్చుకుంది అని టాక్.

2017 లో కంగనా రనౌత్ నటించిన “రంగూన్” “సిమ్రాన్” రిలీజ్ అయ్యే టైం కి హృతిక్ రోషన్ తో తనకి ఉన్న అఫైర్ ని బయట పెట్టి పెద్ద వివాదం సృష్టించి తెగ హల్ చల్ చేసింది ఈ భామ.

ఇదిలా ఉంటే గతం లో తను నటించిన “కట్టి బట్టి” “తను వెడ్స్ మను” సినిమాల టైం లో కూడా లేని పోని వివాదాలు సృష్టించి సినిమాలకి మంచి హైప్ తీసుకొని వచ్చింది. ఇక ఇప్పుడు “మణికర్ణిక” సినిమాకి కూడా అలాగే చేస్తుందని అంటున్నారు.

కానీ కంగనా రనౌత్ డైరెక్టర్ గా తన పేరును కూడా టైటిల్స్ లో వేసుకోవడం పై క్రిష్ ఇప్పటికీ స్పందించ లేదు. ఒకవేళ క్రిష్ ఈ వివాదం పై స్పందించి ఉంటే…. కంగనా రనౌత్ ఏదైతే అనుకోని ఈ వివాదం క్రియేట్ చేసిందో అది సక్సెస్ అయ్యేది. కానీ క్రిష్ సైలెంట్ గా ఉండటంతో కంగనా రనౌత్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందంటున్నారు బాలీవుడ్ జనాలు.

First Published:  20 Dec 2018 4:59 AM GMT
Next Story