Telugu Global
Cinema & Entertainment

బసవతారకం ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ గెటప్ లుక్స్ అయితే కొదవ లేదు. వారానికి 2 రెండు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇంత హంగామా మధ్య కీలకమైన ఓ ఫస్ట్ లుక్ ను మాత్రం మేకర్స్ విడుదల చేయలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. బసవతారకం […]

బసవతారకం ఫస్ట్ లుక్ రిలీజ్
X

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ గెటప్ లుక్స్ అయితే కొదవ లేదు. వారానికి 2 రెండు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

అయితే ఇంత హంగామా మధ్య కీలకమైన ఓ ఫస్ట్ లుక్ ను మాత్రం మేకర్స్ విడుదల చేయలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

బసవతారకం గెటప్ లో నేలపై కూర్చొని విద్యాబాలన్ హార్మోనియం వాయిస్తుంటే…. యంగ్ ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య విద్యాబాలన్ పక్కన కూర్చొని తన్మయత్వం పొందుతున్న స్టిల్ ను ఈరోజు ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. మూవీకి సంబంధించి జయప్రద లుక్ మినహా…. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్ అన్నీ దాదాపు వచ్చేసినట్టే. త్వరలోనే జయప్రద గెటప్ లో ఉన్న పాయల్ రాజ్ పుత్ లుక్ ను కూడా విడుదల చేస్తారు.

రేపు ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్, ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తులంతా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. హీరో ఎన్టీఆర్ కు మాత్రం ఇంకా ఆహ్వానం అందలేదు.

First Published:  20 Dec 2018 7:54 AM GMT
Next Story