Telugu Global
NEWS

ప్రపంచ క్రికెట్లో తిరుగులేని నంబర్ వన్ విరాట్ కొహ్లీ

పెర్త్ టెస్ట్ సెంచరీతో  934 ర్యాంకింగ్ పాయింట్లకు చేరిన కొహ్లీ 900 పాయింట్లతో కొహ్లీ తర్వాతి స్థానంలో కేన్ విలియమ్స్ సన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా తన ర్యాంకింగ్ పాయింట్లను మరింతగా పెంచుకొన్నాడు.  పెర్త్ ఆప్టస్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో…సెంచరీ సాధించడం ద్వారా..కొహ్లీ తన టెస్ట్ సెంచరీల సంఖ్యను 25కు పెంచుకొన్నాడు. అంతేకాదు…ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరడంతో పాటు…సచిన్ […]

ప్రపంచ క్రికెట్లో తిరుగులేని నంబర్ వన్ విరాట్ కొహ్లీ
X
  • పెర్త్ టెస్ట్ సెంచరీతో 934 ర్యాంకింగ్ పాయింట్లకు చేరిన కొహ్లీ
  • 900 పాయింట్లతో కొహ్లీ తర్వాతి స్థానంలో కేన్ విలియమ్స్ సన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా తన ర్యాంకింగ్ పాయింట్లను మరింతగా పెంచుకొన్నాడు.

పెర్త్ ఆప్టస్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో…సెంచరీ సాధించడం ద్వారా..కొహ్లీ తన టెస్ట్ సెంచరీల సంఖ్యను 25కు పెంచుకొన్నాడు.

అంతేకాదు…ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరడంతో పాటు…సచిన్ పేరుతో ఉన్న ఏడు సెంచరీల రికార్డును సైతం సమం చేయడం ద్వారా రికార్డుల మోత మోగించాడు.

అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 63 శతకాలు బాదిన కొహ్లీ…తన ర్యాంకింగ్ పాయింట్లను 934కు పెంచుకొన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ 900 ర్యాంకింగ్ పాయింట్లతో …రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 15, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 48 ర్యాంకుల్లో నిలిచారు. విరాట్ కొహ్లీ తన సమీప ప్రత్యర్థి విలియమ్స్ సన్ కంటే..34 పాయింట్లతో ముందుండటం విశేషం.

First Published:  20 Dec 2018 4:20 AM GMT
Next Story