Telugu Global
NEWS

సొహ్రబుద్దిన్ ఎన్‌కౌంటర్ కేసులో సంచలన తీర్పు

సొహ్రబుద్దిన్ ఎన్‌కౌంటర్ కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా నిర్దోషులేనని తీర్పు చెప్పింది. ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉండేవారు.   కేసులో మొత్తం 22 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. 2005లో షా గుజరాత్‌ […]

సొహ్రబుద్దిన్ ఎన్‌కౌంటర్ కేసులో సంచలన తీర్పు
X

సొహ్రబుద్దిన్ ఎన్‌కౌంటర్ కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా నిర్దోషులేనని తీర్పు చెప్పింది.

ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉండేవారు. కేసులో మొత్తం 22 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.

2005లో షా గుజరాత్‌ హోం మంత్రిగా ఉన్న సమయంలో సొహ్రబుద్దీన్‌ , అతడి భార్య ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని, దీనికి అమిత్‌షాకు సంబంధముందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును షా ప్రభావితం చేస్తారన్న కారణంతో ఆయనను కొంత కాలం గుజరాత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించారు.

2005లో హైదరాబాద్‌ నుంచి సాంగ్లీకి బస్సులో వెళ్తుండగా సోహ్రబుద్దీన్ అదృశ్యం అయ్యాడు. అతడి భార్య కౌసర్‌ బీ, అనుచరులు ప్రజాప్రతి కూడా కనిపించకుండా పోయారు. తర్వాత గాంధీనగర్‌ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు ముగ్గురు చనిపోయారని పోలీసులు ప్రకటించారు.

ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అంటూ 22 మంది పోలీసులపై కేసు నమోదు అయింది. అప్పటి గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పైన కూడా కేసు నమోదు అయింది.

First Published:  21 Dec 2018 2:06 AM GMT
Next Story