Telugu Global
Cinema & Entertainment

బెల్లంకొండ తమ్ముడు వచ్చేస్తున్నాడు

బెల్లంకొండ శ్రీనివాస్…..ఈ హీరో పేరు చెప్తే అందరికి భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పటి వరకు కెరీర్ లో అన్నీ పెద్ద పెద్ద సినిమాలే చేసాడు సాయి శ్రీనివాస్. కానీ అందులో ఒక్క హిట్ కూడా లేదు. శ్రీనివాస్ కూడా ఒక్క భారీ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయం లో బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. అవును బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా రాబోతున్నాడు. ఫణి […]

బెల్లంకొండ తమ్ముడు వచ్చేస్తున్నాడు
X

బెల్లంకొండ శ్రీనివాస్…..ఈ హీరో పేరు చెప్తే అందరికి భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పటి వరకు కెరీర్ లో అన్నీ పెద్ద పెద్ద సినిమాలే చేసాడు సాయి శ్రీనివాస్. కానీ అందులో ఒక్క హిట్ కూడా లేదు. శ్రీనివాస్ కూడా ఒక్క భారీ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయం లో బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు.

అవును బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా రాబోతున్నాడు. ఫణి అనే కొత్త దర్శకుడితో తియ్యబోతున్న ఆ సినిమాకి ఎల్లుండే ముహూర్తం. అసలు సాయి శ్రీనివాస్ కే ఇప్పటిదాకా ఒక్క హిట్ లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటప్పుడు తమ్ముడి ఎంట్రీ ఏంటి అనే డౌట్ రావొచ్చు…కానీ గణేష్ కి మాత్రం హీరో అవ్వాలని అనేది కోరికట.

అందుకే హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడట గణేష్. మరి బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరో హిట్ కొడతాడో లేకపోతే అన్న లాగే యావరేజ్ హీరోగా మిగిలిపోతాడో చూడాలి.

ఇకపోతే గతం లో అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ ఇలాగే ఎంట్రీ ఇచ్చి డీలా పడిపోయాడు. అలాగే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కు అయితే ఇప్పటికీ సరైన హిట్ కోసం ట్రై చేస్తున్నాడు.

First Published:  20 Dec 2018 11:42 PM GMT
Next Story