Telugu Global
NEWS

టీ-20 మహిళా క్రికెట్లో మరో సునామీ సెంచరీ

బిగ్ బాష్ లీగ్ లో గ్రేస్ హారిస్ మెరుపు శతకం 42 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 13 బౌండ్రీలతో సెంచరీ విండీస్ ప్లేయర్ దేవేంద్ర డోటిన్ పేరుతో ప్రపంచ రికార్డు భారత క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ 49 బాల్స్ శతకం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ బాదుడులో తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని…మహిళా క్రికెటర్లు సైతం చాటు కొంటున్నారు. ఆస్ట్రేలియా దేశవాళీ టీ-20 బిగ్ బాష్ మహిళల లీగ్ లో… బ్రిస్బేన్ హీట్ జట్టు ప్లేయర్ గ్రేస్ […]

టీ-20 మహిళా క్రికెట్లో మరో సునామీ సెంచరీ
X
  • బిగ్ బాష్ లీగ్ లో గ్రేస్ హారిస్ మెరుపు శతకం
  • 42 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 13 బౌండ్రీలతో సెంచరీ
  • విండీస్ ప్లేయర్ దేవేంద్ర డోటిన్ పేరుతో ప్రపంచ రికార్డు
  • భారత క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ 49 బాల్స్ శతకం

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ బాదుడులో తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని…మహిళా క్రికెటర్లు సైతం చాటు కొంటున్నారు. ఆస్ట్రేలియా దేశవాళీ టీ-20 బిగ్ బాష్ మహిళల లీగ్ లో… బ్రిస్బేన్ హీట్ జట్టు ప్లేయర్ గ్రేస్ హారిస్ కేవలం 42 బాల్స్ లోనే మెరుపుశతకం సాధించింది. బ్రిస్బేన్ గాబా స్టేడియం వేదికగా మెల్బోర్న్ స్టార్స్ తో ముగిసిన మ్యాచ్ లో గ్రేస్ హారిస్ చెలరేగిపోయింది.

గ్రేస్ బాదుడే బాదుడు….

5 సిక్సర్లు, 13 బౌండ్రీలతో సెంచరీ పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. బిగ్ బాష్ లీగ్ లో ఇప్పటి వరకూ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు…యాష్ లీగ్ గార్డ్నర్ పేరుతో ఉంది.

అయితే…టీ-20 ప్రపంచకప్ లో మాత్రం ప్రపంచ రికార్డు సాధించిన ఘనత విండీస్ ప్లేయర్ దేవేంద్ర డోటిన్ పేరుతో ఉంది. డోటిన్ కేవలం 38 బాల్స్ లోనే సెంచరీ సాధించడం విశేషం. మహిళా క్రికెట్ చరిత్రలోనే ఇప్పటికే డోటిన్ పేరుతోనే ప్రపంచ రికార్డు ఉంది.

హర్మన్ పేరుతో భారత రికార్డు….

భారత మహిళా క్రికెట్లో మాత్రం ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఘనత హర్మన్ ప్రీత్ కౌర్ కే ఉంది.

ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై హర్మన్ ప్రీత్ కేవలం 49 బాల్స్ లోనే వంద పరుగులు సాధించింది. మొత్తం 51 బాల్స్ లో 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో హర్మన్ ప్రీత్ కౌర్ 113 పరుగులు సాధించింది.

ఇంగ్లండ్ పేరుతో టీమ్ రికార్డు….

ఇంగ్లండ్ వేదికగా జరిగిన మహిళా టీ-20 ముక్కోణపు సిరీస్ …రౌండ్ రాబిన్ లీగ్ లో… రెండు సరికొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.

ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు పోటీపడుతున్న…. ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా ప్రత్యర్థిగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో…వికెట్ నష్టానికి 216 పరుగుల స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

ఒక్క టోర్నీ…. రెండు ప్రపంచ రికార్డులు….

అయితే…ఆ రికార్డును..ఆతిథ్య ఇంగ్లండ్ 34 పరుగులతో తిరగరాసింది. సౌతాఫ్రికా ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 3 వికెట్లకు 250 పరుగుల స్కోరుతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బ్యూమోంట్..కేవలం 52 బాల్స్ లోనే 22 బౌండ్రీలతో 116 పరుగుల స్కోరు సాధించింది.

2004 మహిళా టీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా సాధించిన 4 వికెట్లకు 209 పరుగుల స్కోరే…మహిళా టీ-20 చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధిక టీమ్ స్కోరుగా ఉంది.

అయితే…ఆ రికార్డును న్యూజిలాండ్ 216 పరుగుల స్కోరుతో అధిగమిస్తే… ఇంగ్లండ్ 250 పరుగులతో తిరగరాసింది.

First Published:  21 Dec 2018 3:58 AM GMT
Next Story