Telugu Global
Cinema & Entertainment

ఆ అనుభవాన్ని విక్రమ్ కే కుమార్ సినిమాలో చూపిస్తున్నాడట!

నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విక్రం కే కుమార్ తో సినిమాకు సైన్ చేసాడు నాని. ప్రస్తుతం విక్రం కే కుమార్ ఆ కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకత్వ […]

ఆ అనుభవాన్ని విక్రమ్ కే కుమార్ సినిమాలో చూపిస్తున్నాడట!
X

నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విక్రం కే కుమార్ తో సినిమాకు సైన్ చేసాడు నాని.

ప్రస్తుతం విక్రం కే కుమార్ ఆ కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో నాని విక్రమ్ కే కుమార్ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ సినిమాలో నానితో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉందట.

ఇదిలా ఉంటే నాని “జెర్సీ” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న అనిరుద్ రవిచంద్రన్…. విక్రం కే కుమార్ సినిమాకి కూడా పని చేయనున్నాడట. ఇకపోతే ఈ సినిమాలో నాని నవలా రచయిత గా కనిపించనున్నాడు.

First Published:  21 Dec 2018 2:08 AM GMT
Next Story