Telugu Global
Cinema & Entertainment

భలే వీకెండ్ " దేనికదే డిఫరెంట్ సినిమా

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ఒక సినిమాను మరో సినిమాతో ఏమాత్రం పోల్చలేని విధంగా, డిఫరెంట్ జానర్స్ తో తెరకెక్కాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ ”అంతరిక్షం”. సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో వస్తున్న మొట్టమొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీ ఇదే. ఇక అంతరిక్షంతో పాటు వస్తున్న మరో సినిమా ”పడి పడి లేచే మనసు”. […]

భలే వీకెండ్  దేనికదే డిఫరెంట్ సినిమా
X

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ఒక సినిమాను మరో సినిమాతో ఏమాత్రం పోల్చలేని విధంగా, డిఫరెంట్ జానర్స్ తో తెరకెక్కాయి.

వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ ”అంతరిక్షం”. సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో వస్తున్న మొట్టమొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీ ఇదే.

ఇక అంతరిక్షంతో పాటు వస్తున్న మరో సినిమా ”పడి పడి లేచే మనసు”. ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ. హను రాఘవపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ రెండు సినిమాలకు పోటీగా వస్తున్న మరో మూవీ ”కేజీఎఫ్”.

అంతరిక్షం, పడి పడి లేచే మనసు సినిమాలతో ”కేజీఎఫ్” కు ఎలాంటి పోలిక లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా యాక్షన్ మూవీ. యష్ హీరోగా నటించాడు ఈ సినిమాలో.

ఇలా 3 డిఫరెంట్ జానర్స్ కు చెందిన 3 సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క సినిమాను మరో సినిమాతో పోల్చలేం. అందుకే ప్రేక్షకులు కూడా చిన్న డైలమాలో ఉన్నారు. ఏ సినిమా ముందు చూడాలనే ఉత్సుకత అందర్లో కనిపిస్తోంది. ఈ 3 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

First Published:  20 Dec 2018 7:02 PM GMT
Next Story