Telugu Global
NEWS

ఓ ఇంటివాడైన కేరళ డైనమైట్ సంజు శాంసన్

చిన్ననాటి స్నేహితురాలు చారులతతో సంజు వివాహం ప్రత్యేక చట్టం ప్రకారం సంజు-చారు వివాహం నమోదు హిందు యువతి చారులతతో క్రిస్టియన్ యువకుడు సంజు శాంసన్ కేరళ డైనమైట్, టీమిండియా యంగ్ గన్ , ఐపీఎల్ విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడైన సంజు శాంసన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను మూడుముళ్ల బంధంతో జీవిత భాగస్వామిగా చేసుకొన్నాడు. ఐపీఎల్ రెయిజింగ్ స్టార్…. ఇండియా-ఏ, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ […]

ఓ ఇంటివాడైన కేరళ డైనమైట్ సంజు శాంసన్
X
  • చిన్ననాటి స్నేహితురాలు చారులతతో సంజు వివాహం
  • ప్రత్యేక చట్టం ప్రకారం సంజు-చారు వివాహం నమోదు
  • హిందు యువతి చారులతతో క్రిస్టియన్ యువకుడు సంజు శాంసన్

కేరళ డైనమైట్, టీమిండియా యంగ్ గన్ , ఐపీఎల్ విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడైన సంజు శాంసన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను మూడుముళ్ల బంధంతో జీవిత భాగస్వామిగా చేసుకొన్నాడు.

ఐపీఎల్ రెయిజింగ్ స్టార్….

ఇండియా-ఏ, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల ద్వారా అసాధారణ హిట్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్న సంజు శాంసన్…దేశవాళీ రంజీట్రోఫీలో కేరళజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

8 కోట్ల రూపాయల వేలం ధరతో గత సీజన్ నుంచి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఆడుతున్న సంజు కు దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా పేరుంది.

క్రీజులోకి దిగాడంటే చాలు…బౌండ్రీలు, సిక్సర్లతో చెలరేగిపోయే సంజు…క్రికెటర్ గా మాత్రమే కాదు…ఓ వ్యక్తిగాను జీవితంలో స్థిరపడాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను…. జీవిత భాగస్వామిగా చేసుకొన్నాడు.

ప్రత్యేక చట్టం ప్రకారం వివాహం….

సంజు శాంసన్‌‌, చారులతల కుటుంబాలకు చక్కటి అనుబంధమే ఉంది. డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సంజూ-చారులతల మధ్య ప్రేమ ప్రారంభమయ్యింది. ఒకరినొకరు ఇష్టపడిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పి.. ఒప్పించారు.

కోవలం లోని ఓ రిసార్టులో …రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే సంజూ క్రిస్టియన్ మతస్తుడు కాగా, చారులత హిందూ మతానికి చెందిన యువతి. వీరిద్దరి వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేశారు.

సంజు ఐపీఎల్ ధర 8 కోట్లు….

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన సంజూను 2013 ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఈ టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్ల చూపు సంజూపై పడింది. దీంతో 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు అతనిని ఎంపిక చేశారు.

అంతేకాదు…. 2018 ఐపీఎల్ సీజన్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ…సంజును 8 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. దానికి తగ్గట్టుగానే…ఐపీఎల్ 11లో సంజు తన మెరుపుబ్యాటింగ్ తో పరుగుల వెల్లువెత్తించి..వారేవ్వా అనిపించుకొన్నాడు.

మొత్తం మీద…బ్యాటు వీరుడు సంజు తన స్నేహితురాలు కమ్ ప్రియురాలు చేతిలో స్టంపౌట్ కావడం ద్వారా….వివాహ బంధంలో అడుగుపెట్టాడు.

First Published:  22 Dec 2018 11:00 AM GMT
Next Story