హెచ్.ఐ.వీ టెస్ట్ చేసి మరీ యువతులతో డాక్టర్ల రేవ్ పార్టీ

హైదరాబాద్ లో విదేశీ సంస్కృతి పెచ్చరిల్లుతోంది. యువతీ, యువకులతో పాటు నవతరం డాక్టర్లు కూడా ఆధునిక భావాలతో చెలరేగిపోతున్నారు. వీకెండ్ వస్తే చాలు పార్టీలు, పబ్బులంటూ నానా హంగామా చేస్తున్నారు.

హైదరాబాద్ శివారులో పనిచేసే ఏడుగురు యువ డాక్టర్లు…. తాజాగా హైదరాబాద్ శివారు లోని శామీర్ పేట్ లో ఉన్న సెలెబ్రిటీ రిసార్ట్ ను బుక్ చేసుకొని నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు చేసుకున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

హైదరాబాద్ లోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఏడుగురు యువ డాక్టర్లు కలిసి ముంబై నుంచి నలుగురు అందమైన యువతులను తెచ్చుకున్నారు. వారిని నిన్న రాత్రి 1 గంట నుంచి తెల్లవారు జాము వరకు బుక్ చేసుకున్నారు. డాక్టర్లు కావడంతో ఒకవేళ హద్దుమీరవచ్చన్న ఉద్దేశంతో మెడికల్ కిట్లు తెచ్చుకొని ఆ నలుగురు యువతులకు పార్టీకి ముందుగానే హెచ్.ఐ.వీ టెస్ట్ చేశారు. పోలీసుల దాడి సమయంలో అక్కడ హెచ్.ఐ.వీ కిట్స్ ఉండడం చూసి వారు అవాక్కయ్యారు.

పార్టీలో ఒకవేళ కండోమ్ లాంటి సాధనాలు వాడకుండా శృంగారం చేస్తే ఎయిడ్స్ వస్తుందని ముందే గ్రహించిన యువ డాక్టర్లు మద్యం తాగడానికి ముందే ఇలా యువతులకు హెచ్.ఐవీ. టెస్ట్ లు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

యువ డాక్టర్లు ఇంత పకడ్బందీగా చేసుకుంటున్న రేవ్ పార్టీని ఈరోజు ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువ డాక్టర్లు, నలుగురు ముంబై యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: