Telugu Global
National

తగ్గిన జీఎస్‌టీ " సినిమా టికెట్లతో పాటు ధర తగ్గే వస్తువులివే...

జీఎస్‌టీ స్లాబుల్లో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. పలు వస్తువులపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 33 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. 28 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లో ఉన్న ఏడు వస్తువులను 18శాతం స్లాబులోకి తీసుకొచ్చారు. 26 వస్తువులను 18 శాతం నుంచి 12 శాతం స్లాబులోకి మార్చారు. సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గిస్తారని భావించినా అది జరగలేదు. తాజా నిర్ణయంతో టీవీలు, కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ ధరలు తగ్గనున్నాయి. సినిమా […]

తగ్గిన జీఎస్‌టీ  సినిమా టికెట్లతో పాటు ధర తగ్గే వస్తువులివే...
X

జీఎస్‌టీ స్లాబుల్లో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. పలు వస్తువులపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 33 వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

28 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లో ఉన్న ఏడు వస్తువులను 18శాతం స్లాబులోకి తీసుకొచ్చారు. 26 వస్తువులను 18 శాతం నుంచి 12 శాతం స్లాబులోకి మార్చారు. సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గిస్తారని భావించినా అది జరగలేదు.

తాజా నిర్ణయంతో టీవీలు, కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ ధరలు తగ్గనున్నాయి. సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి. తగ్గిన ధరలు జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జైట్లీ చెప్పారు.

ఇప్పటి వరకు 28 శాతం స్లాబులో ఉన్న ఎయిర్‌ కండిషనర్లు, 32 ఇంచుల టీవీలు, టైర్లు, బ్యాటరీల పవర్‌ బ్యాంకులు 18శాతం జీఎస్‌టీ స్లాబులోకి మార్చారు. వంద రూపాయిల కంటే లోపు ధర ఉన్న సినిమా టికెట్లపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.

వంద రూపాయల కంటే అధిక ధర ఉన్న సినిమా టికెట్ల జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చారు. దివ్యాంగులకు సంబంధించిన ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్‌టీ 18 శాతం ఉండగా దాన్ని ఇప్పుడు ఏకంగా 5 శాతం జీఎస్‌టీ స్లాబులోకి తీసుకొచ్చారు. థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్‌పై వసూలు చేసే జీఎస్‌టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు.

First Published:  22 Dec 2018 6:33 AM GMT
Next Story