Telugu Global
Cinema & Entertainment

ఈ మహాలక్ష్మిది రాజమండ్రి

దాదాపు ఏడాదిగా నలుగుతున్న ”దటీజ్ మహాలక్ష్మి” సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనారనౌత్ పాత్రలో తమన్న నటిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. అందుకే దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టీజర్ లో రాజమండ్రికి చెందిన అమ్మాయిగా తమన్న కనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలామందికి తెలిసిందే. టాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలామంది క్వీన్ […]

ఈ మహాలక్ష్మిది రాజమండ్రి
X

దాదాపు ఏడాదిగా నలుగుతున్న ”దటీజ్ మహాలక్ష్మి” సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనారనౌత్ పాత్రలో తమన్న నటిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. అందుకే దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

టీజర్ లో రాజమండ్రికి చెందిన అమ్మాయిగా తమన్న కనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలామందికి తెలిసిందే. టాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలామంది క్వీన్ సినిమా చూసేశారు. కాబట్టి సినిమా కథపై ఎవరికీ ఎలాంటి ఆసక్తి లేదు. ఎటొచ్చి కంగనా రనౌత్ అద్భుతంగా పండించిన పాత్రను తమన్న ఎలా చేసిందనేదే ఇక్కడ పాయింట్.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు అసలు దర్శకుడు నీలకంఠ. యూనిట్ తో గొడవ జరగడంతో అతడు తప్పుకున్నాడు. తర్వాత మిగతా భాగాన్ని మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తిచేశాడు.

దీంతో ఇప్పుడు దర్శకుడు అనే విభాగంలో ఎవరి పేరు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే దర్శకుడు పేరు లేకుండానే ప్రచారం స్టార్ట్ చేశారు. దటీజ్ మహాలక్ష్మి సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది.

First Published:  21 Dec 2018 11:51 PM GMT
Next Story