Telugu Global
Cinema & Entertainment

పబ్లిసిటీ కోసమే మీ-టూ....

కాస్టింగ్ కౌచ్ పై, మీ-టూ ఉద్యమంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా దీనిపై నటుడు అరవింద స్వామి కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన అరవింద స్వామి, మరోసారి ఈ అంశంపై సూటిగా స్పందించారు. “ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఎవరి అభిప్రాయాల్ని వారు వెల్లడించే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయి. అయితే దాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం పొందాలని చూడకూడదు. ఆరోపణల ఆధారంగా […]

పబ్లిసిటీ కోసమే మీ-టూ....
X

కాస్టింగ్ కౌచ్ పై, మీ-టూ ఉద్యమంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా దీనిపై నటుడు అరవింద స్వామి కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన అరవింద స్వామి, మరోసారి ఈ అంశంపై సూటిగా స్పందించారు.

“ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఎవరి అభిప్రాయాల్ని వారు వెల్లడించే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయి. అయితే దాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం పొందాలని చూడకూడదు. ఆరోపణల ఆధారంగా ఎదుటి వ్యక్తిపై నేనెలా విమర్శలు చేయగలను. అది తప్పు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత సమస్య. దానిపై నన్ను స్పందించమని అడగకూడదు.”

ఓ కార్యక్రమంలో అరవింద స్వామి ఇలా మీ-టూపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదని, నిజంగా మీ-టూకు సంబంధించి ఎవరికైనా వ్యక్తిగతంగా తను మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తానని తెలిపాడు.

First Published:  23 Dec 2018 5:00 AM GMT
Next Story