Telugu Global
CRIME

క్వారీలో ఈత.... సెల్ఫీ సరదాకు బీటెక్‌ స్టూడెంట్స్ బలి

సెల్ఫీ సరదా ముగ్గురు బీటెక్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. బోరబండకు చెందిన భార్గవ్, చంద్ర, సూర్య ఆదివారం కావడంతో నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి ఉదయం బయటకు వెళ్లారు. అయితే వారు నెక్లెస్ రోడ్డుకు వెళ్లలేదు. కొత్వాలగూడ సమీపంలోని క్వారీ గుంతల వద్దకు వెళ్లారు. తవ్వి వదిలేసిన క్వారీలో భారీగా వర్షం నీరు నిల్వ ఉండడంతో అక్కడ సరదాగా ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. తొలుత సెల్ఫీ కోసం […]

క్వారీలో ఈత.... సెల్ఫీ సరదాకు బీటెక్‌ స్టూడెంట్స్ బలి
X

సెల్ఫీ సరదా ముగ్గురు బీటెక్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. బోరబండకు చెందిన భార్గవ్, చంద్ర, సూర్య ఆదివారం కావడంతో నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి ఉదయం బయటకు వెళ్లారు.

అయితే వారు నెక్లెస్ రోడ్డుకు వెళ్లలేదు. కొత్వాలగూడ సమీపంలోని క్వారీ గుంతల వద్దకు వెళ్లారు. తవ్వి వదిలేసిన క్వారీలో భారీగా వర్షం నీరు నిల్వ ఉండడంతో అక్కడ సరదాగా ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. తొలుత సెల్ఫీ కోసం ప్రయత్నించారు.

ఈ సమయంలోనే ఒక విద్యార్ధి నీటిలో పడిపోయాడు. అతడిని రక్షించే క్రమంలో మిగిలిన ఇద్దరు కూడా లోతుకు వెళ్లి చనిపోయారు. అటుగా వెళ్లిన వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో సూర్య, చంద్రలు అన్నదమ్ములు.

క్వారీ తవ్వి వదిలేయడంతో భారీగా ఉన్న గుంతలో వర్షపు నీరు చేరింది. దీంతో కొందరు విద్యార్దులు అక్కడికి వెళ్లి ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. పైగా నిర్మానుష్మంగా ఉండడంతో యువకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్వారీలు పూడ్చి పెట్టక పోవడం వల్లే భారీగా వర్షపు నీరు చేరి ఈ ఘటనకు కారణమైందని చెబుతున్నారు.

First Published:  23 Dec 2018 7:48 AM GMT
Next Story