Telugu Global
Cinema & Entertainment

ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చెర్రీ

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఆడియో రిలీజ్, ట్రయిలర్ రిలీజ్ పేరిట భారీ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఈ హీరో తన సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశాడు. ఈనెల 27న ఆ కార్యక్రమం ఉంటుంది. 27న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. […]

ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చెర్రీ
X

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఆడియో రిలీజ్, ట్రయిలర్ రిలీజ్ పేరిట భారీ కార్యక్రమం నిర్వహించారు.

ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఈ హీరో తన సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశాడు. ఈనెల 27న ఆ కార్యక్రమం ఉంటుంది.

27న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాడు చిరంజీవి.

అవును.. తనయుడి సినీప్రచారానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ను వెంటనే ప్రకటించారు.

బోయపాటి-చరణ్ కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. చరణ్ సంగతి పక్కనపెడితే బోయపాటికి ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకం. ఎందుకంటే అతడు త్వరలోనే మెగాస్టార్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తేడాకొడితే, బోయపాటికి చిరంజీవి అవకాశం ఇవ్వకపోవచ్చు.

First Published:  24 Dec 2018 11:33 AM GMT
Next Story