Telugu Global
Cinema & Entertainment

అప్పుడు ప్రభాస్ పెద్ద స్టార్ కాదు

బాహుబలితో ప్రభాస్ పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ అంతకుముందు అతడు కేవలం నటుడు మాత్రమే. ఇది మేం అంటున్న మాట కాదు. హీరోయిన్ కంగనా రనౌత్ ఇలా అంటుంది. నిత్యం వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రభాస్ పై ఇలా కామెంట్స్ చేసి అభిమానుల ట్రోలింగ్ కు గురవుతోంది. “ప్రభాస్ చాలా మంచోడు. అతడితో నేను వర్క్ చేశాను. ఆ టైమ్ కు ప్రభాస్ బిగ్ స్టార్ కాదు. ప్రస్తుతం అతడు సూపర్ స్టార్. […]

అప్పుడు ప్రభాస్ పెద్ద స్టార్ కాదు
X

బాహుబలితో ప్రభాస్ పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ అంతకుముందు అతడు కేవలం నటుడు మాత్రమే. ఇది మేం అంటున్న మాట కాదు. హీరోయిన్ కంగనా రనౌత్ ఇలా అంటుంది. నిత్యం వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రభాస్ పై ఇలా కామెంట్స్ చేసి అభిమానుల ట్రోలింగ్ కు గురవుతోంది.

“ప్రభాస్ చాలా మంచోడు. అతడితో నేను వర్క్ చేశాను. ఆ టైమ్ కు ప్రభాస్ బిగ్ స్టార్ కాదు. ప్రస్తుతం అతడు సూపర్ స్టార్. ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని ఉంది. అతడు, నేను… ఇద్దరం డ్యూయల్ రోల్స్ చేస్తూ ఓ సినిమా వస్తే బాగుంటుంది.”

ఇక్కడితో ఆగలేదు ఈ బ్యూటీ. ప్రభాస్ కంటే మహేష్ సరసన నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ప్రకటించింది. ఆ వెంటనే కాస్త తేరుకొని దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడు సూపర్ స్టార్ అంటూ పొగిడేసింది.

“ప్రభాస్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మేమిద్దం ఒకర్నొకరం ఆటపట్టించుకునే వాళ్లం. ప్రభాస్ విజయం చూసి గర్వపడుతున్నాను. కంగ్రాట్స్ ప్రభాస్. ఓ నటుడి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగావు. చాలా ఆనందంగా ఉంది. నీతో మరోసారి వర్క్ చేయాలని ఉంది.”

తను ఎంత కవర్ చేసినా ప్రభాస్ ఫ్యాన్స్ కు అడ్డంగా బుక్ అయిపోయింది కంగనా రనౌత్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనాపై వరుసగా పోస్టులు పడుతున్నాయి. మణికర్ణిక మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగన, ఈ కామెంట్స్ చేసింది.

First Published:  24 Dec 2018 6:36 AM GMT
Next Story