Telugu Global
NEWS

చంద్రబాబుపై మోడీ ఘాటు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రధాని మోడీ మండిపడ్డారు. తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్‌ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్‌ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్యహించిన మోడీ… ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. […]

చంద్రబాబుపై మోడీ ఘాటు వ్యాఖ్యలు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రధాని మోడీ మండిపడ్డారు. తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్‌ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్‌ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్యహించిన మోడీ… ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు.

కేవలం పదవులు, అధికారమే పరమావధిగా దేశంలో కూటమి ఏర్పడిందని మోడీ విమర్శించారు. ఈ కూటమిలో ఉన్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్‌ చేతిలో వేధింపులకు గురైనవారేనన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలైన వారే ఇప్పుడు కాంగ్రెస్‌ వద్దకు చేరారని ఎద్దేవా చేశారు.

ములాయం సింగ్‌ను అక్రమ కేసులతో కాంగ్రెస్‌ వేధించిందన్నారు. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదన్నారు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్‌…. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమిటని మోడీ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి కాంగ్రెస్‌పై గెలుపు సాధించారన్నారు. ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ పాదాల వద్ద పెట్టారని మోడీ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని విమర్శించారు. టీడీపీ- కాంగ్రెస్ తరహా అనైతిక పొత్తుల కోసం బీజేపీ ఏనాడు పాకులాడబోదని మోడీ చెప్పారు.

First Published:  23 Dec 2018 10:38 PM GMT
Next Story