Telugu Global
CRIME

ఆ కానిస్టేబుల్‌కు ప్రేమ జంటలు కనిపిస్తే అంతే సంగతులు...

చట్టాన్ని రక్షించడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎవరైనా కానిస్టేబుల్ కావాలనుకుంటారు. కానీ విజయనగరం జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ మాత్రం దొంగతనాలకు లైసెన్స్‌గా తన యూనిఫాంను వాడుకున్నాడు. మరదలితో వివాహేతర సంబంధం, చెడు వ్యసనాల కారణంగా ఖర్చులు పెరగడంతో దొంగతనాన్ని పార్ట్‌టైం జాబ్‌గా ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కిపోయాడు. విజయనగరం జిల్లా ఎస్‌ కోట మండలం మామిడిపల్లికి చెందిన శివప్రసాద్… 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరాడు. ఆ తర్వాత గ్రేహౌండ్స్‌కు వెళ్లాడు. గ్రేహౌండ్స్‌లో ఉనప్పుడే తోటి సిబ్బంది […]

ఆ కానిస్టేబుల్‌కు ప్రేమ జంటలు కనిపిస్తే అంతే సంగతులు...
X

చట్టాన్ని రక్షించడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎవరైనా కానిస్టేబుల్ కావాలనుకుంటారు. కానీ విజయనగరం జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ మాత్రం దొంగతనాలకు లైసెన్స్‌గా తన యూనిఫాంను వాడుకున్నాడు.

మరదలితో వివాహేతర సంబంధం, చెడు వ్యసనాల కారణంగా ఖర్చులు పెరగడంతో దొంగతనాన్ని పార్ట్‌టైం జాబ్‌గా ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కిపోయాడు. విజయనగరం జిల్లా ఎస్‌ కోట మండలం మామిడిపల్లికి చెందిన శివప్రసాద్… 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరాడు.

ఆ తర్వాత గ్రేహౌండ్స్‌కు వెళ్లాడు. గ్రేహౌండ్స్‌లో ఉనప్పుడే తోటి సిబ్బంది వద్ద చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. అంతలోనే మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి భార్య పిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. శివప్రసాద్‌పై అతడి భార్య గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శివప్రసాద్‌ తీరు సరిగా లేకపోవడంతో 2014లో సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి దొంగతానాలకే ఫుల్ టైం కేటాయిస్తూ వస్తున్నాడు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో బాపూజీ అనే మరో దొంగతో కలిసి దొంగతనాలు మొదలుపెట్టాడు. సస్పెండ్ అయినప్పటికీ యూనిఫాం వేసుకునే బయట తిరిగేవాడు.

నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంటలు ఉండే చోటును గమనించి అక్కడికి వెళ్లేవాడు. యూనిఫాంలో వెళ్లే శివప్రసాద్‌ తాను పోలీస్ అంటూ ప్రేమ జంటలను బెదరగొట్టేవాడు. అమ్మాయిల ఒంటి మీద ఉన్న నగలు, అబ్బాయిల వద్ద ఉండే డబ్బు, వాచీలు, ఉంగరాలు లాక్కునేవాడు.

నోరుమూసుకుని డబ్బు, నగలు ఇచ్చి వెళ్తారా లేదంటే స్టేషన్‌కు తీసుకెళ్లాలా అని బెదిరించేవాడు. అంతటితో ఆగకుండా రోడ్ల మీద వెళ్లే మహిళల మెడ నుంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడేవాడు.

దీంతో నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు శివప్రసాద్‌తో పాటు మరో దొంగ బాపూజీని అరెస్ట్ చేశారు. శివప్రసాద్‌ నుంచి నాలుగు వందల గ్రాముల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. యూనిఫాం, ఐడీ కార్డును సీజ్ చేశారు.

First Published:  24 Dec 2018 1:34 AM GMT
Next Story