ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన మాణిక్యాల రావు

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన 56 హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వివరించారు.

ఏకపక్షంగా టీడీపీకి అండగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లాకు న్యాయం చేసే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని మాణిక్యాలరావు ఆరోపించారు. 15 రోజుల్లోగా హామీల అమలుకు చంద్రబాబు కార్యాచరణ ప్రకటించకుంటే… తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించండి అంటూ…. చంద్రబాబుకు తన రాజీనామా లేఖను మాణిక్యాలరావు పంపించారు.

చంద్రబాబు స్పందించకుంటే 16 వ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని మాణిక్యాలరావు ప్రకటించారు. టీడీపీనేతల ఒత్తిడి కారణంగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాణిక్యాలరావు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. తన మీద కక్ష ఉంటే తన రాజీనామాను ఆమోదించి ఆ తర్వాతనైనా అభివృద్ధి పనులు చేయాలని ఆయన కోరారు.