తెలుగు అమ్మాయిలు కావలెను….

హిట్‌ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టారు. హీరో రామ్‌తో సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్‌గానే ప్రకటించారు. ‘పూరీ కనెక్ట్స్‌’ చైర్మన్‌గా ఉన్న హీరోయిన్ చార్మీ ఈ విషయాన్ని ప్రకటించారు.

జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది…. మేలో విడుదలవుతుందని చార్మీ ప్రకటించారు. రామ్ హీరోగా పూరి డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని పూరి భార్య లావణ్య సమర్పణలో తెరకెక్కిస్తున్నారు.

చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న… తెలుగు మాట్లాడే అచ్చం తెలుగమ్మాయిలు కావాలని కాస్టింగ్ కాల్ ఇచ్చారు పూరి జగన్నాథ్.

వరుసగా తన సినిమాలు బోల్తా కొడుతున్న నేపథ్యంలో కసి మీద ఉన్న పూరి ఈ సారైనా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.