ధనుష్ కు శర్వానంద్ అలా కలిసొచ్చాడు

ధనుష్ నటించిన మారి-2 సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. అటు శర్వానంద్ నటించిన పడి పిడి లేచె మనసు కూడా ఫ్లాప్ అయింది. కానీ ఒక విషయంలో ధనుష్ కు శర్వానంద్ బాగా హెల్ప్ అయ్యాడు. అదే థియేటర్ల కేటాయింపు.

పడి పడి లేచె మనసు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో బి, సి సెంటర్లలోని కొన్ని సింగిల్ స్క్రీన్స్ నుంచి దాన్ని తొలిగించారు. అలా తొలిగించిన థియేటర్లను అచ్చంగా మారి-2 సినిమాకు కేటాయించడం విశేషం. నిజానికి ఈ సినిమా హిట్ అవ్వలేదు. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడం వల్లనే తన సినిమా క్లిక్ అవ్వలేదంటున్నాడు ధనుష్.

ఇప్పుడు పడి పడి లేచె మనసు తో పాటు అంతరిక్షం సినిమా నుంచి కూడా కొన్ని థియేటర్లు మారి-2కు రాబోతున్నాయి. మరి ఈ సినిమా క్లిక్ అవుతుందా? ధనుష్ మాత్రం మంచి నమ్మకంతో ఉన్నాడు. పెరిగిన థియేటర్ల కారణంగా తన సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుందని చెబుతున్నాడు. అంతేకాదు, త్వరలోనే మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేస్తానంటున్నాడు.