“భాగమతి” డైరెక్టర్ తో సాయి ధరం తేజ్?

ఈ ఏడాది జనవరి లో రిలీజ్ అయి సూపర్ హిట్ ని అందుకున్న సినిమా “భాగమతి”. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అశోక్ డైరెక్ట్ చేసాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తుంది. ఇప్పుడు ఒక కథ రెడీ చేసుకున్నాడట డైరెక్టర్ అశోక్. ఈ కథని సాయి ధరం తేజ్ కి చెప్పాడట అశోక్. కథ నచ్చిన సాయి ధరం తేజ్ వెంటనే సినిమాకి ఓకే చెప్పిన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాని కూడా పూర్తీ స్థాయి హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాలని అశోక్ డిసైడ్ అయ్యాడట. అలాగే ఈ సినిమాలో కొన్ని “భాగమతి” అంశాలు కూడా జత చేర్చాడట అశోక్. ప్రస్తుతం సాయి ధరం తేజ్ “చిత్రలహరి” సినిమాతో బిజీగా ఉన్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి సాయి ధరం తేజ్ ఫ్రీ అవ్వగానే అశోక్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడట.