Telugu Global
Cinema & Entertainment

మరోసారి వైరల్ అయిన ప్రేమజంట

హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమాయణం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. వీళ్ల ప్రేమాయణం సౌత్ లో బహిరంగ రహస్యం. తమ మధ్య ఉన్న బంధానికి వీళ్లు ఒక పేరు పెట్టకపోయినా, ఎప్పటికప్పుడు తమ ప్రేమను సెల్ఫీల సాక్షిగా బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ ప్రేమజంట, సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రిస్మస్ సందర్భంగా నయన్, విఘ్నేష్ మరోసారి కలిశారు. ఇద్దరూ కలిసి ఎంచక్కా క్రిస్మస్ ట్రీని అలంకరించారు. ఇంకెన్నో […]

మరోసారి వైరల్ అయిన ప్రేమజంట
X

హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమాయణం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. వీళ్ల ప్రేమాయణం సౌత్ లో బహిరంగ రహస్యం. తమ మధ్య ఉన్న బంధానికి వీళ్లు ఒక పేరు పెట్టకపోయినా, ఎప్పటికప్పుడు తమ ప్రేమను సెల్ఫీల సాక్షిగా బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ ప్రేమజంట, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

క్రిస్మస్ సందర్భంగా నయన్, విఘ్నేష్ మరోసారి కలిశారు. ఇద్దరూ కలిసి ఎంచక్కా క్రిస్మస్ ట్రీని అలంకరించారు. ఇంకెన్నో బొమ్మల్ని ఇంటినిండా సర్దారు. ఆ వెంటనే చక్కగా ముస్తాబై సెల్ఫీలు దిగారు. వాటిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విఘ్నేష్. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ జంట కలుసుకోవడం చాలా కామన్ అయిపోయింది. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి నూతన సంవత్సర వేడుకల్ని కూడా జాయింట్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. దీని కోసం వీళ్లు ఇప్పటికే ఓ దేశాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. వాళ్లు ఏ దేశం వెళ్లబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  25 Dec 2018 5:18 AM GMT
Next Story