Telugu Global
Cinema & Entertainment

"మహర్షి" అప్డేట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతుంది “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది. దాదాపు ఎనిమిది కోట్లు వేసి పల్లెటూరి సెట్ వేసారు మూవీ యూనిట్. అయితే ఈ షెడ్యూల్ ఆదివారం తో పూర్తి కానుంది. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ పోలాచ్చి వెళ్తారు. అక్కడ సెలెక్ట్ చేసిన కొన్ని లొకేషన్స్ లో ముఖ్య […]

మహర్షి అప్డేట్స్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతుంది “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది. దాదాపు ఎనిమిది కోట్లు వేసి పల్లెటూరి సెట్ వేసారు మూవీ యూనిట్. అయితే ఈ షెడ్యూల్ ఆదివారం తో పూర్తి కానుంది. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ పోలాచ్చి వెళ్తారు. అక్కడ సెలెక్ట్ చేసిన కొన్ని లొకేషన్స్ లో ముఖ్య సన్నివేశాలు షూట్ చేయబోతున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పీవీపీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖున ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ ఏడాది “భరత్ అనే నేను” తో మాస్ హిట్ ని అందుకున్న మహేష్ బాబు వచ్చే ఏడాది క్లాస్ లుక్ లో రాబోతున్నాడు. అమెరికా లో ఒక పెద్ద కంపెనీ కి సి.ఈ.ఓ గా మహేష్ బాబు నటిస్తున్నాడు. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  25 Dec 2018 4:02 AM GMT
Next Story