Telugu Global
NEWS

హైదరాబాద్‌లో ముగ్గురు అక్కా చెల్లెళ్లు అరెస్ట్

హైదరాబాద్‌లో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వీరు మావోయిస్టులు అని పోలీసులు చెబుతున్నారు. అర్బన్‌ నక్సల్స్‌ హైదరాబాద్‌లో దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో దాడులు చేశామని విశాఖ పోలీసులు చెబుతున్నారు. మౌలాలీలో ఆత్మకూరు అనుషా, ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు భవానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు. వీరిలో అనుషా ఇప్పటికే పలు మావోయిస్టుల దాడుల్లో స్వయంగా పాల్గొన్నట్టు చెబుతున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా జనవరి నాలుగు వరకు రిమాండ్ విధించింది. […]

హైదరాబాద్‌లో ముగ్గురు అక్కా చెల్లెళ్లు అరెస్ట్
X

హైదరాబాద్‌లో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వీరు మావోయిస్టులు అని పోలీసులు చెబుతున్నారు. అర్బన్‌ నక్సల్స్‌ హైదరాబాద్‌లో దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో దాడులు చేశామని విశాఖ పోలీసులు చెబుతున్నారు.

మౌలాలీలో ఆత్మకూరు అనుషా, ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు భవానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు. వీరిలో అనుషా ఇప్పటికే పలు మావోయిస్టుల దాడుల్లో స్వయంగా పాల్గొన్నట్టు చెబుతున్నారు.

వీరిని కోర్టులో హాజరుపరచగా జనవరి నాలుగు వరకు రిమాండ్ విధించింది. విశాఖలోనూ మరో మావోయిస్టును అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా అర్బన్‌ మావోయిస్టులుగా పనిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

First Published:  25 Dec 2018 1:29 AM GMT
Next Story