శ్రీశైలంలో తాంత్రిక పూజలు…. రహస్యంగా వీడియో తీసిన సిబ్బంది….

శ్రీశైలం ఆలయ పరిధిలో తాంత్రిక పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి ఆలయ వేద పండితుడు గంటి రాధాకృష్ణ ఈ తాంత్రిక పూజలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటి రాధాకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. తాంత్రిక పూజలకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

గంటి రాధాకృష్ణ ఆలయ పరిధిలోని తన నివాసం ముందు అర్థరాత్రి పూజలు చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది దూరం నుంచి రహస్యంగా వీడియో చిత్రీకరించారు. దీన్ని ఆలయ ఈవోకు అందజేశారు. తాంత్రిక పూజలు చేసింది నిజమేనని నిర్ధారించుకున్నాకే పండితుడిపై వేటు వేసినట్టు చెబుతున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించేందుకు రాధాకృష్ణ సుముఖంగా లేరు.

సెక్యూరిటీ సిబ్బంది తీసిన వీడియో ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏ తరహా తాంత్రిక పూజలు చేశారు?. ఎవరి కోసం చేశారు? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.

అధికారులు మాత్రం ఇలా ఆలయ పరిధిలోని ప్రాంతంలో అనుమతి లేకుండా ఎలాంటి పూజలు చేయడానికి వీల్లేదని… అది నిబంధనలకు విరుద్దమని అంటున్నారు.