Telugu Global
Cinema & Entertainment

వెలవెలబోతున్న క్రిస్మస్ బాక్సాఫీస్

నిజంగా ఇలా జరుగుతుందని తెలిస్తే అఖిల్ తన మూడో సినిమా మిస్టర్ మజ్నును క్రిస్మస్ కే రిలీజ్ చేసేవాడు. అసలు ఇలా జరుగుతుందని తెలిస్తే యాత్ర సినిమాను కూడా డిసెంబర్ 21కే విడుదల చేసి ఉండేవాడు దర్శకుడు మహి వి రాఘవ్. అవును.. క్రిస్మస్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. చెప్పుకోవడానికి 4 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక్కటి కూడా సగటు ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయింది. శర్వానంద్-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడి పడి లేచె మనసు సినిమాపై ఆడియన్స్ కు భారీ […]

వెలవెలబోతున్న క్రిస్మస్ బాక్సాఫీస్
X

నిజంగా ఇలా జరుగుతుందని తెలిస్తే అఖిల్ తన మూడో సినిమా మిస్టర్ మజ్నును క్రిస్మస్ కే రిలీజ్ చేసేవాడు. అసలు ఇలా జరుగుతుందని తెలిస్తే యాత్ర సినిమాను కూడా డిసెంబర్ 21కే విడుదల చేసి ఉండేవాడు దర్శకుడు మహి వి రాఘవ్.

అవును.. క్రిస్మస్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. చెప్పుకోవడానికి 4 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక్కటి కూడా సగటు ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయింది.

శర్వానంద్-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడి పడి లేచె మనసు సినిమాపై ఆడియన్స్ కు భారీ అంచనాలుండేవి. పైన చెప్పుకున్న సినిమాలు రెండూ తప్పుకోవడానికి కూడా ఇదే కారణం. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత డిజాస్టర్ అయింది ఈ మూవీ. సెకెండాఫ్ ను కిచిడీ చేసి పడేశాడు హను రాఘవపూడి.

అంతరిక్షం సినిమాది మరో కథ. సినిమా బాగుందంటున్నారు కానీ వసూళ్లు మాత్రం రావడం లేదు. థియేటర్లన్నీ ఖాళీ. దీనికి కారణం ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఆడే సినిమా కాదు. ఫలితంగా ఈ క్రిస్మస్ కు అంతరిక్షం కూడా పెర్ ఫెక్ట్ సినిమా అనిపించుకోలేకపోయింది.

ఇక కేజీఎఫ్, మారి-2 సినిమాల గురించి ఎఁత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేజీఎఫ్ బాగుందని ఓ వర్గం అంటున్నప్పటికీ స్టార్ ఎట్రాక్షన్ లేకపోవడం వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడం లేదు. ఇక మారి-2 విషయానికొస్తే ఈ మూవీని పట్టించుకున్న నాధుడు లేడు. ఇలా 4 సినిమాలు చెల్లాచెదురు కావడంతో క్రిస్మస్ బాక్సాఫీస్ బోసిపోయింది.

First Published:  24 Dec 2018 8:01 PM GMT
Next Story