Telugu Global
Cinema & Entertainment

తేజు కథతో బన్నీ సినిమా?

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన సొంత సంస్థ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో పెద్ద సినిమాలు చేయడం ఆపేసి గీత ఆర్ట్స్ 2 అని స్థాపించి అందులో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తు బన్నీ వాసుని నిర్మాత చేశాడు. “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో సాయి ధరం తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు. సాయి ధరం తేజ్ గత కొంత […]

తేజు కథతో బన్నీ సినిమా?
X

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన సొంత సంస్థ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో పెద్ద సినిమాలు చేయడం ఆపేసి గీత ఆర్ట్స్ 2 అని స్థాపించి అందులో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తు బన్నీ వాసుని నిర్మాత చేశాడు.

“గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో సాయి ధరం తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు. సాయి ధరం తేజ్ గత కొంత కాలంగా ఫ్లాప్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే మెగా స్టార్ చిరంజీవి అల్లు అరవింద్ ని పిలిచి సాయి ధరం తేజ్ కి గీత ఆర్ట్స్ బ్యానర్ లో మంచి కథతో సినిమా చేయించు అని చెప్పాడట. అల్లు అరవింద్ కూడా అందుకు ఓకే చెప్పి “గీత గోవిందం” తో హిట్ అందుకున్న పరశురాంని కథ రెడీ చేయమని చెప్పాడట.

ఇక పరశురాం రెడీ చేసిన కథ ఇప్పుడు అల్లు అర్జున్ కి నచ్చి అతనికి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల మధ్య ఏ హీరోతో అల్లు అరవింద్ ఆ కథతో సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి.

First Published:  26 Dec 2018 1:27 AM GMT
Next Story