Telugu Global
NEWS

బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజున టీమిండియా 2 వికెట్లకు 215 పరుగులు

అరంగేట్రం హీరో మయాంక్ అగర్వార్ 76 పరుగులు పూజారా 68, విరాట్ కొహ్లీ 47 పరుగుల స్కోర్లతో నాటౌట్ భారీస్కోరుకు గురిపెట్టిన టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజుఆటను టీమిండియా ఘనంగా ముగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియాకు స్టాప్ గ్యాప్ ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్- హనుమ విహారీ 40 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.  విహారీ 8, మయాంక్ 76 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా…వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 68, కెప్టెన్ […]

బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజున టీమిండియా 2 వికెట్లకు 215 పరుగులు
X
  • అరంగేట్రం హీరో మయాంక్ అగర్వార్ 76 పరుగులు
  • పూజారా 68, విరాట్ కొహ్లీ 47 పరుగుల స్కోర్లతో నాటౌట్
  • భారీస్కోరుకు గురిపెట్టిన టీమిండియా

బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజుఆటను టీమిండియా ఘనంగా ముగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియాకు స్టాప్ గ్యాప్ ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్- హనుమ విహారీ 40 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

విహారీ 8, మయాంక్ 76 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా…వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 68, కెప్టెన్ విరాట్ కొహ్లీ 47 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో నిలిచారు.

తొలిరోజు ఆటను టీమిండియా 2 వికెట్లకు 215 పరుగుల స్కోరుతో ముగించింది. కంగారూ బౌలర్లలో కమ్మిన్స్ ఒక్కడే 40 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మయాంక్ అరంగేట్రం అదుర్స్….

అంతకుముందు….ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా…మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైన మూడోటెస్ట్ తొలిరోజుఆటలో…టీమిండియా అరంగేట్రం ఓపెనర్ మయాంక్ అగర్వార్ స్ట్రోక్ ఫుల్ బ్యాటింగ్ తో సత్తా చాటుకొన్నాడు.

భారత 295వ టెస్ట్ క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన 27 ఏళ్ల మయాంక్….ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ లో…టెస్ట్ క్యాప్ అందుకోడమే కాదు…హనుమ విహారితో కలసి మొదటి వికెట్ కు 40 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

అంతటితో ఆగిపోకుండా 95 బాల్స్ లో …6 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 161 బాల్స్ లో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 76 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా మయాంక్ అగర్వాల్ రికార్డు సాధించాడు.

1999 బాక్సింగ్ డే టెస్టు ద్వారా హృషికేశ్ కనిత్కర్, 2014 బాక్సింగ్ డే టెస్టు ద్వారా కెఎల్ రాహుల్ టెస్ట్ అరంగేట్రం సాధిస్తే…ఇప్పుడు మయాంక్ అగర్వాల్ …. 2018 బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా టెస్ట్ క్యాప్ అందుకోడం విశేషం.

పూజారా- కొహ్లీ కీలక భాగస్వామ్యం….

మయాంక్ అగర్వాల్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీ తో కలసి వన్ డౌన్ పూజారా మూడో వికెట్ కు 92 పరుగుల అజేయభాగస్వామ్యంతో…భారీస్కోరుకు పునాది వేశాడు.

పూజారా 152 బాల్స్ లో 4 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేయటంతో పాటు…తొలిరోజు ఆట ముగిసే సమయానికి 200 బాల్స్ లో 6 బౌండ్రీలతో 68 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

ఇక…కెప్టెన్ కొహ్లీ…107 బాల్స్ ఎదుర్కొని 6 బౌండ్రీలతో 47 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

కంగారూ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ ఒక్కడే 40 పరుగులిచ్చి టీమిండియా ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయటం విశేషం.

First Published:  26 Dec 2018 2:44 AM GMT
Next Story