కూలిన ఆగస్టా హెలికాప్టర్‌… గవర్నర్‌ దంపతులు మృతి

సెంట్రల్ మెక్సికోలోని ప్యూబ్లా నగర సమీపంలో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యూబ్లా గవర్నర్ మార్తా ఎరికా మృతి చెందారు. ఆమె భర్త, మాజీ గవర్నర్ రాఫెల్‌ మొరెనో కూడా ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు.

మార్తా దంపతులు తమ ఆగస్టా హెలికాప్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆగస్టా హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.

మెక్సికో వెళ్తున్న సమయంలో కొర్నాంగో పట్టణ సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తి హెలికాప్టర్‌ కూలిపోయిందని ప్యూబ్లా భద్రతా వ్యవహారాల మంత్రి వివరించారు.

హెలికాప్టర్ కండిషన్‌ను అంచనా వేసేందుకు అవసరమైన వివరాలు ప్రస్తుతం తమ వద్ద లేవన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు… ఆగస్టా సంస్థను కూడా సంప్రదిస్తున్నారు.