Telugu Global
Cinema & Entertainment

సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు " శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పడి పడి లేచే మనసు”. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఆ రోజు రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా “పడి పడి లేచే మనసు” నిలిచింది. అయితే ఈ ఫ్లాప్ గురించి స్పందించాడు శర్వానంద్. శర్వానంద్ మాట్లాడుతూ “అసలు ఈ సినిమాని హను నేను ఎంతో ఇష్టపడి […]

సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు  శర్వానంద్
X

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పడి పడి లేచే మనసు”. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఆ రోజు రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా “పడి పడి లేచే మనసు” నిలిచింది. అయితే ఈ ఫ్లాప్ గురించి స్పందించాడు శర్వానంద్.

శర్వానంద్ మాట్లాడుతూ “అసలు ఈ సినిమాని హను నేను ఎంతో ఇష్టపడి చేసాం, ఇదొక పెద్ద సినిమా మంచి సినిమా అవుతుంది అని భావించాం. కానీ మొదటి రోజు నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం భాధాకరం. సినిమా ఎలా ఉన్న కూడా ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గరైంది. నేను ఎన్ని సినిమాల్లో నటించిన కూడా “పడి పడి లేచే మనసు” నా లైఫ్ లో ది బెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది. రివ్యూ రైటర్స్, క్రిటిక్స్ అందరూ తమ తమ ఉద్దేశాన్ని చెప్పింనందుకు థాంక్స్” అని శర్వానంద్ తెలిపాడు. సినిమా రిలీజ్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సినిమా కలెక్షన్స్ పడిపోయాయి.

First Published:  25 Dec 2018 10:55 PM GMT
Next Story