యూఎస్‌లో ఘోరం… ముగ్గురు తెలుగువాళ్లు సజీవ దహనం

అమెరికాలో ఘోరం జరిగింది. కొలిరవిలిలోని ఓ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరొకరు కూడా కన్నుమూశారు.

క్రిస్‌మస్‌ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు.

వారిలో ఇద్దరు బయటపడగా… నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఫైర్ అలారం పనిచేయక పోవడంతో ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేక పోయారు. మృతుల్లో అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. వీరిని సాత్విక్ నాయక్, సహాస్‌ నాయక్‌, జయసుచిత్‌గా గుర్తించారు.

వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపుతాండ. చదువుల కోసం వీరు అమెరికాలో ఉంటున్నారు. వీరి తల్లిదండ్రులు మిషనరీ పని మీద నల్లగొండ జిల్లాకు వచ్చారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.