Telugu Global
Cinema & Entertainment

మెహరీన్ పై పగబట్టిన టాలీవుడ్ హీరోలు?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “కృష్ణ గాడి వీర ప్రేమగాధ” సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. ఆ సినిమా హిట్ తరువాత మెహరీన్ కి తెలుగు లో మంచిగానే అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే దాదాపు ఆరు వరకు తెలుగు లో సినిమాలు చేసింది మెహరీన్, కానీ ఇప్పుడు మా సినిమాలో మెహరీన్ కి ఛాన్స్ ఇవ్వొద్దని దర్శక నిర్మాతలకు చెబుతున్నారట హీరోలు. అలాగే కొంత మంది యంగ్ హీరోలు తమ తదుపరి సినిమాల్లో […]

మెహరీన్ పై పగబట్టిన టాలీవుడ్ హీరోలు?
X

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “కృష్ణ గాడి వీర ప్రేమగాధ” సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. ఆ సినిమా హిట్ తరువాత మెహరీన్ కి తెలుగు లో మంచిగానే అవకాశాలు వచ్చాయి.

ఇప్పటికే దాదాపు ఆరు వరకు తెలుగు లో సినిమాలు చేసింది మెహరీన్, కానీ ఇప్పుడు మా సినిమాలో మెహరీన్ కి ఛాన్స్ ఇవ్వొద్దని దర్శక నిర్మాతలకు చెబుతున్నారట హీరోలు.

అలాగే కొంత మంది యంగ్ హీరోలు తమ తదుపరి సినిమాల్లో మెహరీన్ ని హీరోయిన్ గా తీసుకోవద్దని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. దాంతో నిజంగానే ఈ భామకు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క “ఎఫ్ 2” చిత్రం తప్ప మరో సినిమా లేకుండా పోయింది.

మెహరీన్ మీద యంగ్ హీరోలకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే ఈ భామ హీరోలకు సహకరించకపోవడమేనట. మెహరీన్ అసలు హీరోలకి సహకరించకపోగా షూటింగ్ లో బెట్టు చేస్తోందని, రకరకాల కండీషన్ లు పెడుతోందని, సెట్ లో హీరోలకి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ భామని హీరోయిన్ గా తీసుకోవద్దని గట్టిగా డిసైడ్ అయ్యారట పలువురు హీరోలు.

First Published:  25 Dec 2018 11:50 PM GMT
Next Story