Telugu Global
Cinema & Entertainment

బిజీ బిజీగా వెంకీ

గత ఏడాది “గురు” సినిమాతో బిగ్ స్క్రీన్ ని పలకరించిన వెంకీ ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు, కానీ వచ్చే ఏడాది మొదట్లోనే “ఎఫ్ 2” సినిమాని రిలీజ్ చేస్తాడు వెంకీ. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తోపాటు వచ్చే ఏడాది కోసం మరో రెండు సినిమాలు సైన్ చేసాడు వెంకీ. దాంట్లో […]

బిజీ బిజీగా వెంకీ
X

గత ఏడాది “గురు” సినిమాతో బిగ్ స్క్రీన్ ని పలకరించిన వెంకీ ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు, కానీ వచ్చే ఏడాది మొదట్లోనే “ఎఫ్ 2” సినిమాని రిలీజ్ చేస్తాడు వెంకీ. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తోపాటు వచ్చే ఏడాది కోసం మరో రెండు సినిమాలు సైన్ చేసాడు వెంకీ. దాంట్లో ఒక డైరెక్టర్ పేరు బయటకి రాలేదు కానీ మరో సినిమాని మాత్రం త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తాడు అని టాక్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల యొక్క షూటింగ్ వచ్చే ఏడాదే స్టార్ట్ చేసి ధియేటర్స్ లో కూడా వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసాడు అంట వెంకటేష్. ఇకపోతే వెంకీ, నాగ చైతన్య హీరోలుగా మొదలైన “వెంకీ మామ” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ ఈ సినిమా కూడా స్టార్ట్ అయితే వచ్చే ఏడాది మొత్తం మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటాడు అనమాట వెంకటేష్.

First Published:  25 Dec 2018 10:27 PM GMT
Next Story