Telugu Global
Cinema & Entertainment

బోయపాటికి 12 కోట్లు ఆఫర్ చేసిన బాలక్రిష్ణ

“ఎన్టీఆర్” బయోపిక్ తరువాత బాలక్రిష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంత భారీ మొత్తం ఎందుకు అంటే బాలయ్య ని ఎలా చూపించాలో బోయపాటి శ్రీను కు బాగా తెలియడమే. ఇంతకుముందు బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో “సింహా” “లెజెండ్” చిత్రాలు రాగా […]

బోయపాటికి 12 కోట్లు ఆఫర్ చేసిన బాలక్రిష్ణ
X

“ఎన్టీఆర్” బయోపిక్ తరువాత బాలక్రిష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంత భారీ మొత్తం ఎందుకు అంటే బాలయ్య ని ఎలా చూపించాలో బోయపాటి శ్రీను కు బాగా తెలియడమే.

ఇంతకుముందు బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో “సింహా” “లెజెండ్” చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా బాలయ్య లోని సరికొత్త నటుడిని చూపించాయి అలాగే ఆ రెండు సినిమాల్లో హీరోయిజంని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసాడు బోయపాటి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ స్వంత బ్యానర్ లో బాలక్రిష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది. ఈ సినిమాలో బాలక్రిష్ణ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించనున్నాడు అని టాక్.

First Published:  27 Dec 2018 1:31 AM GMT
Next Story