Telugu Global
National

చిచ్చు రాజేస్తున్న యాక్సిడెంట‌ల్ ప్రై మినిస్ట‌ర్ సినిమా

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ జీవితంపై వ‌స్తున్న యాక్సిడెంట‌ల్ ప్రైమినిస్ట‌ర్ చిత్రంపై వివాదం రాజుకుంటోంది. చిత్రంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. సినిమాను ముందుగా త‌మ‌కు చూపించ‌క‌పోతే అడ్డుకుంటామ‌ని కాంగ్రెస్ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. సినిమాలో వాస్త‌వాలు వ‌క్రీక‌రించార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌న్మోహ‌న్ సింగ్ పాత్ర‌లో అనుప‌మ్ ఖేర్ న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 11న ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌న్మోహ‌న్‌తో పాటు గాంధీ కుటుంబాన్ని కించ‌ప‌రిచేలా సినిమా తీశార‌న్న‌ది కాంగ్రెస్ ఆరోప‌ణ‌. మ‌న్మోహ‌న్‌కు మీడియా […]

చిచ్చు రాజేస్తున్న యాక్సిడెంట‌ల్ ప్రై మినిస్ట‌ర్ సినిమా
X

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ జీవితంపై వ‌స్తున్న యాక్సిడెంట‌ల్ ప్రైమినిస్ట‌ర్ చిత్రంపై వివాదం రాజుకుంటోంది. చిత్రంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది.

సినిమాను ముందుగా త‌మ‌కు చూపించ‌క‌పోతే అడ్డుకుంటామ‌ని కాంగ్రెస్ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. సినిమాలో వాస్త‌వాలు వ‌క్రీక‌రించార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ చిత్రంలో మ‌న్మోహ‌న్ సింగ్ పాత్ర‌లో అనుప‌మ్ ఖేర్ న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 11న ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌న్మోహ‌న్‌తో పాటు గాంధీ కుటుంబాన్ని కించ‌ప‌రిచేలా సినిమా తీశార‌న్న‌ది కాంగ్రెస్ ఆరోప‌ణ‌.

మ‌న్మోహ‌న్‌కు మీడియా అడ్వ‌యిజ‌ర్‌గా ప‌నిచేసిన సంజ‌య్ బారు రాసిన పుస్త‌కం ఆధారంగా ఈ సినిమా తీశారు.

సంజ‌య్ బారు పాత్ర‌లో అజ‌య్ ఖ‌న్నా న‌టిస్తున్నారు. విడుద‌ల‌కు ముందే యాక్సిడెంట‌ల్ ప్రైమినిస్ట‌ర్ సినిమాను త‌మ‌కు చూపించాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

సోనియా పాత్ర‌ను ఇంగ్లీష్ న‌టి సుజానే న‌టించారు. ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అనుప‌మ్ ఖేర్ అచ్చం మ‌న్మోహ‌న్ సింగ్ త‌ర‌హాలోనే క‌నిపిస్తున్నారు.

కాంగ్రెస్ వాద‌న‌ను బీజేపీ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయనే కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

First Published:  28 Dec 2018 2:18 AM GMT
Next Story