Telugu Global
Cinema & Entertainment

"బ్లఫ్‌ మాస్టర్‌" సినిమా రివ్యూ

రివ్యూ: బ్లఫ్‌ మాస్టర్‌ రేటింగ్‌: 2/5 తారాగణం: సత్యదేవ్‌, నందిత శ్వేత, ఆదిత్య మీనన్‌, సిజ్జు తదితరులు సంగీతం: సునీల్‌ కాశ్యప్‌ నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్‌, పి. రమేష్‌ దర్శకత్వం: గోపి గణేష్‌ ఇవాళ విడుదలైన చిన్న సినిమాల్లో కాస్త పెద్దదిగా కనిపించిన ‘బ్లఫ్ మాస్టర్’ థియేటర్లలో అడుగు పెట్టింది. సత్యదేవ్ కు హీరోగా ఎలాంటి ఇమేజ్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకం ప్రేక్షకులను ఓ లుక్ వేసేలా చేసింది. అంతంతమాత్రంగా ఉన్న అంచనాలను అమాంతం పెంచింది బ్లఫ్ మాస్టర్. […]

బ్లఫ్‌ మాస్టర్‌ సినిమా రివ్యూ
X

రివ్యూ: బ్లఫ్‌ మాస్టర్‌
రేటింగ్‌: 2/5
తారాగణం: సత్యదేవ్‌, నందిత శ్వేత, ఆదిత్య మీనన్‌, సిజ్జు తదితరులు
సంగీతం: సునీల్‌ కాశ్యప్‌
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్‌, పి. రమేష్‌
దర్శకత్వం: గోపి గణేష్‌

ఇవాళ విడుదలైన చిన్న సినిమాల్లో కాస్త పెద్దదిగా కనిపించిన ‘బ్లఫ్ మాస్టర్’ థియేటర్లలో అడుగు పెట్టింది. సత్యదేవ్ కు హీరోగా ఎలాంటి ఇమేజ్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకం ప్రేక్షకులను ఓ లుక్ వేసేలా చేసింది. అంతంతమాత్రంగా ఉన్న అంచనాలను అమాంతం పెంచింది బ్లఫ్ మాస్టర్.

ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) డబ్బు కోసం దారుణమైన ఆర్థిక నేరాలు చేయడమే పనిగా పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అవని (నందిత శ్వేత) ని ప్రేమలో పడేసి తన బిజినెస్ ప్రమోట్ చేసుకుని వదిలేస్తాడు. ఆ తర్వాత అలాగే మోసాలు కొనసాగిస్తూ ఓ డాన్ (ఆదిత్య మీనన్)వల్ల లైఫ్ లో పెద్ద ప్రమాదంలో పడతాడు. తిరిగి వచ్చి ఉత్తమ్ ని పెళ్లి చేసుకున్న అవని కూడా రిస్క్ లో పడుతుంది. చుట్టూ పద్మవ్యూహం ఏర్పడుతుంది. మరి ఉత్తమ్ ఇందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ.

సత్యదేవ్ మోసగాడి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ కాకపోయినా బాగానే మేనేజ్ చేసాడు. ఇప్పటిదాకా సపోర్టింగ్ రోల్స్ కే అంకితం అయిపోయిన సత్యదేవ్ కు ఇది నిజంగా మంచి పాత్రే. అయితే సోలోగా తన భుజాల మీదే సినిమా మొత్తాన్ని మోసే రేంజ్ కి ఇంకా చేరుకోలేదు కాబట్టి ఇంత బరువైన పాత్ర కాస్త భారమే అనిపిస్తుంది. అయినా కూడా పాస్ అయ్యాడు.

హీరోయిన్ నందిత శ్వేతా పూర్తిగా మైనస్ అయ్యింది. అసహజ నటనతో విసుగు తెప్పించింది. విలన్ గా నటించిన ఆదిత్య మీనన్ అక్కడక్కడా ఓవర్ చేసినా బాగానే నప్పాడు. సైడ్ విలన్ వంశీకి మొదటిసారి కాస్త ఎక్కువ స్కోప్ దొరికింది. పృథ్వి, బ్రహ్మాజీ, చైతన్య కృష్ణ తదితరులు అందరివి చిన్న చిన్న పాత్రలే.

దర్శకుడు గోపి గణేష్ తీసుకున్న తమిళ హిట్ సతురంగ వెట్టైకు ఎలాంటి మార్పులు లేకుండా స్క్రిప్ట్ రాసుకోవడం దీనికి అసలు మైనస్. కావాల్సినన్ని మలుపులు, సంఘటనలు ఉన్నా అందులో ఉన్న టెంపో మిస్ కావడంతో ఏదీ ఆసక్తికరంగా సాగదు. ఎక్కడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు.

పైగా ఇప్పుడు సిల్లీగా అనిపించే నాలుగేళ్ళ వెనుకటి ఎపిసోడ్స్ నే ఇందులో తీసుకోవడంతో ఇంపాక్ట్ తగ్గిపోయింది. కావాల్సిన మార్పులు చేసి స్క్రీన్ ప్లే టైట్ చేసుంటే ఖచ్చితంగా రేంజ్ పెరిగేది. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు గణేష్.

సెకండ్ హాఫ్ లో లాస్ట్ అరగంట బాగానే ఎంగేజ్ చేసినా మిగిలినదంతా ప్రహసనంలా అనిపించడం…. ఫైనల్ గా దీన్ని మాములు సినిమాగా మార్చేసింది. సునీల్ కశ్యప్ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ మాత్రమే బాగుంది. పాటలు సోసోనే. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం బాగానే ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా లేదు. పావు గంట కోతకు చాలా ఛాన్స్ ఉంది. భారీ సినిమాలు తీసే శ్రీదేవి మూవీస్ ఇంతగా రాజీ పడటం ఎందుకో అర్థం కాదు.

చివరిమాటగా చెప్పాలంటే బ్లఫ్ మాస్టర్ పైకి క్రైమ్ థ్రిల్లర్ లా కనిపించే ఒక మాములు సినిమా. ఏదీ ఆశించకుండా వెళ్తేనే ఓ మాదిరిగా యావరేజ్ అనిపించే ఈ సినిమా…. సత్యదేవ్ యాక్టింగ్ టాలెంట్ ని మెరుగుపరుచుకోవడానికి తప్ప ఇంకే రకంగానూ బ్లఫ్ మాస్టర్ ఆకట్టుకునేలా కనిపించదు. ఎలా ఉన్నా పర్లేదు క్రైమ్ ఉంటే చాలు అనుకుంటే తప్ప బ్లఫ్ మాస్టర్ ఛాయిస్ గా పెట్టుకోలేం.

బ్లఫ్ మాస్టర్ : టఫ్ మాస్టర్

First Published:  28 Dec 2018 7:46 AM GMT
Next Story