హిందీ సినిమాకి రీమేక్ గా “మిస్టర్ మజ్ను” ?

అఖిల్ అక్కినేని హీరో గా నటిస్తున్న మూడో సినిమా “మిస్టర్ మజ్ను”. ఈ ఏడాది “తోలిప్రేమ” సినిమాతో హిట్ ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పనులు మొత్తం పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ పనులు త్వరగా పూర్తీ చేసుకొని వచ్చే ఏడాది జనవరి 25 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ సినిమా అయిన “బచ్నా యే హసీనా” సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది అనే వార్తలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి. ఆ హిందీ సినిమాలో హీరో ప్లే బాయ్ ఉంటాడు, అలాంటి ఒక హీరో తన లైఫ్ లోకి ఒక అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో మంచి వాడిగా మారిపోతాడు. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రేమని ఎలా సంపాదించుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇక “మిస్టర్ మజ్ను” సాంగ్స్ ఇంకా టిజర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే కథతో రన్ అవుతుంది అని అర్ధం అవుతుంది. అందుకే ఈ సినిమా ఆ సినిమాకి ఫ్రీ మేక్ గా తెరకెక్కింది అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.