Telugu Global
Cinema & Entertainment

డ్యూయల్ రోల్ లో ప్రభాస్ 

“సాహో” సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న ప్రభాస్ మరో వైపు రాధా క్రిష్ణ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పార్టి స్థాయి ప్రేమ కథగ తెరకేక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలో 1960 లో ఒక లుక్, 2016 లో మరో లుక్ […]

డ్యూయల్ రోల్ లో ప్రభాస్ 
X

“సాహో” సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న ప్రభాస్ మరో వైపు రాధా క్రిష్ణ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పార్టి స్థాయి ప్రేమ కథగ తెరకేక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.

అందుకే ఈ సినిమాలో 1960 లో ఒక లుక్, 2016 లో మరో లుక్ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి “ఆమూర్” అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమా యూరప్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి టైటిల్ విషయంలో ఇబ్బంది ఏమి లేదని, సినిమాలో ఒక చోట ఆమూర్ కి ఫ్రెంచ్ లో ప్రేమ అనే అర్ధం వస్తుందని ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇకపోతే గతంలో ఇదే సినిమాకి “జాన్” అనే టైటిల్ ని కూడా అనుకున్నారు మూవీ యూనిట్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్, గోపి క్రిష్ణ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.

First Published:  27 Dec 2018 11:40 PM GMT
Next Story