Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" కూడా రెండు పార్ట్స్ గా రాబోతుందా? 

ఎస్.ఎస్. రాజమౌళి “బాహుబలి” తరువాత తీస్తున్న కమర్షియల్ సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక కొన్ని రోజులు షూట్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. పెళ్ళి అయిపోగానే మళ్ళీ రెండవ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తాడట రాజమౌళి. ఇక ఈ సినిమా ని దర్శకుడు 1930 నుండి 2018 కాలం మధ్య లో తెరకేక్కిస్తున్నాడన్న వార్తలొస్తున్నాయి. […]

ఆర్.ఆర్.ఆర్ కూడా రెండు పార్ట్స్ గా రాబోతుందా? 
X

ఎస్.ఎస్. రాజమౌళి “బాహుబలి” తరువాత తీస్తున్న కమర్షియల్ సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

ఇక కొన్ని రోజులు షూట్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. పెళ్ళి అయిపోగానే మళ్ళీ రెండవ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తాడట రాజమౌళి.

ఇక ఈ సినిమా ని దర్శకుడు 1930 నుండి 2018 కాలం మధ్య లో తెరకేక్కిస్తున్నాడన్న వార్తలొస్తున్నాయి. అంటే ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో రూపొందుతోందని అర్ధం.

ఇక ఈ కథని కూడా రాజమౌళి రెండు భాగాలుగా తీయాలని డిసైడ్ అయినట్టు టాక్. ఇప్పటికే “బాహుబలి” “బాహుబలి 2” తో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న రాజమౌళి…. ఇప్పుడు ఈ “ఆర్.ఆర్.ఆర్”ను కూడా రెండు పార్ట్స్ తో…. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై డి.వి.వి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 2020 లో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.

First Published:  28 Dec 2018 4:27 AM GMT
Next Story