Telugu Global
NEWS

టీడీపీకి షాక్‌... వైసీపీలోకి సీనియర్ నేత

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. టీడీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి, ఇప్పటి టీడీపీకి పొంతన లేకుండా పోయిందన్నారు. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి […]

టీడీపీకి షాక్‌... వైసీపీలోకి సీనియర్ నేత
X

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. టీడీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి, ఇప్పటి టీడీపీకి పొంతన లేకుండా పోయిందన్నారు. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పారు.

ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకో లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక కథలు చెప్పారని… త్యాగాలు చేయాలంటూ తనలాంటి వారికి చెప్పారన్నారు. తమలాంటి వారు పార్టీకి సహకరిస్తే చివరకు … అవినీతిపరులకే వంతపాడుతున్నారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారే గానీ పనులు చేయడం లేదన్నారు. ఈనేపథ్యంలో టీడీపీని వీడుతున్నట్టు చెప్పారు.

ఆళ్లగడ్డలో అత్యంత సీనియర్ అయిన రాంపుల్లారెడ్డి పార్టీ వీడడం టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావిస్తున్నారు. ఇప్పటికే ఆళ్లగడ్డ టీడీపీలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పుడు రాంపుల్లారెడ్డి కూడా పార్టీ వీడడం టీడీపీకి ఇబ్బందికర పరిణామమే.

First Published:  29 Dec 2018 4:34 AM GMT
Next Story