Telugu Global
Cinema & Entertainment

కాజల్ అగర్వాల్ పొగరుబోతట!

స్టార్  హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు కెరీర్ లో చాలా మంది హీరోస్ తో నటించింది, అందులో స్టార్ హీరోస్ తో పాటు కుర్ర హీరోలు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్యే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో “కవచం” అనే సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఇక మళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ దర్శకత్వం లో వస్తున్న సినిమాతో జత కడుతుంది ఈ భామ. ఈ విధంగా ఓకే హీరోతో ఫస్ట్ […]

కాజల్ అగర్వాల్ పొగరుబోతట!
X

స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు కెరీర్ లో చాలా మంది హీరోస్ తో నటించింది, అందులో స్టార్ హీరోస్ తో పాటు కుర్ర హీరోలు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్యే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో “కవచం” అనే సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఇక మళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ దర్శకత్వం లో వస్తున్న సినిమాతో జత కడుతుంది ఈ భామ. ఈ విధంగా ఓకే హీరోతో ఫస్ట్ టైం బ్యాక్ తో బ్యాక్ నటిస్తుంది కాజల్ అగర్వాల్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండే అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపించబోతోంది అని టాక్. కాజల్ నెగిటివ్ రోల్స్ ఇంతవరకు చేయలేదు. దశాబ్దానికి పైగా గ్లామర్ రోల్స్ చేస్తూనే ఉంది. దీనితో ఇక రూటుమార్చాలని కాజల్ అగర్వాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఇక మాములుగానే గ్లామర్ హీరోయిన్స్ తో నటన రాబట్టుకునే తేజ ఇప్పుడు కాజల్ అగర్వాల్ తో ఈ నెగటివ్ క్యారెక్టర్ ని ఎలా చేయించాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First Published:  29 Dec 2018 2:06 AM GMT
Next Story