Telugu Global
National

ఆర్ఎస్ఎస్ రంగంలోకి.... మోడీషాలకు ఆప్షన్ ఈయనేనట....

బీజేపీకి దేశంలో వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. దీంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇక నుంచి అంతా మా ఇష్టం అనడానికి ఏమాత్రం వీల్లేదని మోడీ, షాలకు ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వినకపోతే ఆప్షన్లు రెడీగా ఉన్నాయని కూడా ఆర్ఎస్ఎస్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీలో ఇద్దరిదే కీరోల్. మోడీ, అమిత్ షా తప్ప బీజేపీ లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికైనా ఉందా అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. […]

ఆర్ఎస్ఎస్ రంగంలోకి.... మోడీషాలకు ఆప్షన్ ఈయనేనట....
X

బీజేపీకి దేశంలో వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. దీంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇక నుంచి అంతా మా ఇష్టం అనడానికి ఏమాత్రం వీల్లేదని మోడీ, షాలకు ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వినకపోతే ఆప్షన్లు రెడీగా ఉన్నాయని కూడా ఆర్ఎస్ఎస్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు బీజేపీలో ఇద్దరిదే కీరోల్. మోడీ, అమిత్ షా తప్ప బీజేపీ లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికైనా ఉందా అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. పార్టీ కురువృద్ధుడైన అద్వానీని కూడా మోడీషాలు నిస్సహాయుడిని చేశారు. పార్టీ, ప్రభుత్వాన్ని ఈ ఇద్దరు అంతలా శాసిస్తున్నారు. పార్టీ గెలిచినంత సేపు వీరి హవా నడిచింది. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోర ఓటమి బాట పట్టింది. దీంతో అసంతృప్త నేతలు రంగంలోకి దిగారు. మోడీషాలకు చెక్ పెట్టేల్సిందేనని గడ్కరీ లాంటి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు.

అందుకే ఇంటెలిజెన్స్ సమావేశంలో ఓటమికి బాధ్యత వహించి ఆ వ్యక్తులు తప్పుకోవాలని గడ్కరీ పేర్కొనడం దుమారం రేపింది. అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ అసంతృప్తులు నరుక్కొస్తున్నారట.. అటు సంఘ్ పరివార్ కూడా చూసీ చూడనట్టు ఉండొద్దని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అందుకే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను నియమించాలని ఆర్ఎస్ఎస్ చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

తాజాగా బీజేపీలో మరో గళం వినిపిస్తోంది. మాజీ కేంద్రమంత్రి ప్రియగౌతమ్…. అమిత్ షాను టార్గెట్ చేశారు. ఓటమికి బాధ్యత వహించి షా వైదొలగాలని డిమాండ్ చేశారు. నితిన్ గడ్కరీని ఉపప్రధానిని చేయాలని…. శివరాజ్ సింగ్ కు బీజేపీ జాతీయాధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షాకు రాజ్యసభ పదవి ఇచ్చి ఆయన్ను అక్కడికే పరిమితం చేయాలని కోరారు.

మధ్యప్రదేశ్ కి 13 ఏళ్లు సీఎంగా చేసిన శివరాజ్ సింగ్ ను తాజాగా బీజేపీ పొలిటికల్ స్క్రీన్ లోకి తీసుకురావడం వెనుక ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను పూర్తిగా మోడీషాలకు ఇవ్వకుండా చేయడానికే ఆర్ఎస్ఎస్ ఈ ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

మరి ఆర్ఎస్ఎస్ వార్నింగ్ ను మోడీషాలు పట్టించుకుంటారా? కాస్త తగ్గి సీనియర్లకు వచ్చే ఎన్నికలలో ప్రాధాన్యం ఇస్తారా? లేక తమదైన శైలిలో ముందుకు వెళతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  29 Dec 2018 1:13 AM GMT
Next Story