Telugu Global
NEWS

ప్రణయ్ భార్య అమృత ఇంటికి యువకుడు.... సెల్‌లో కీలక విషయాలు

మిర్యాలగూడలో ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శిస్తూ వెళ్తుండేవారు. గతంలో ఒక జంట ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడిస్తామంటూ ప్రణయ్‌ భార్య అమృత వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మతో మాట్లాడిస్తామన్న జంటను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమృత ఇంటికి వచ్చిన మరో యువకుడిపై కేసు నమోదు అయింది. వినోద్ అనే వ్యక్తి ఇటీవల ప్రణయ్‌ ఇంటికి తరుచూ వస్తున్నాడు. ప్రణయ్ భార్య, కుటుంబ సభ్యుల […]

ప్రణయ్ భార్య అమృత ఇంటికి యువకుడు.... సెల్‌లో కీలక విషయాలు
X

మిర్యాలగూడలో ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శిస్తూ వెళ్తుండేవారు. గతంలో ఒక జంట ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడిస్తామంటూ ప్రణయ్‌ భార్య అమృత వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మతో మాట్లాడిస్తామన్న జంటను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమృత ఇంటికి వచ్చిన మరో యువకుడిపై కేసు నమోదు అయింది.

వినోద్ అనే వ్యక్తి ఇటీవల ప్రణయ్‌ ఇంటికి తరుచూ వస్తున్నాడు. ప్రణయ్ భార్య, కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి దగ్గరయ్యాడు. వినోద్ మిర్యాలగూడలో టెక్స్‌టైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇలా తరుచూ ఇంటికి వస్తున్న వినోద్‌పై ప్రణయ్ కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. దాంతో వినోద్… అమృత తల్లికి టచ్‌లో ఉన్నట్టు ఫోన్ కాల్స్ ఆధారంగా బయటపడింది. వినోద్‌పై పోలీసులకు ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

వినోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. అమృత మనసు మార్చేందుకు ఆమె తల్లే వెనుకుండి వినోద్‌ను పంపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్థానిక సీఐ వివరించారు.

First Published:  29 Dec 2018 4:57 AM GMT
Next Story